యువగళంతో వైకాపాలో ప్రకంపనలు
-మంగళగిరి వైకాపాని వీడిన నేతలు
-యువనేత నారా లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిక
యువగళం జైత్రయాత్ర నవశకానికి నాంది పలికింది. టిడిపి యువనేత నారా లోకేష్ తన పాదయాత్రతో రాష్ట్రంలో రగిలించిన ప్రజాచైతన్యం వైకాపాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కీలక వైకాపా నేతలు ఆ పార్టీని వీడి టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో శనివారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో వైకాపా నేతలైన గుంటూరు జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్తా, మంగళగిరి మాజీ కౌన్సిలర్ మండ్రు రమాదేవి-మండ్రు రాము, మంగళగిరి వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం అధ్యక్షులు పెండెం శివరామ కృష్ణ (సిటీ కేబుల్) లు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి టిడిపి కండువాలు కప్పి సాదరంగా స్వాగతించారు. త్వరలో ఏర్పడబోయే ప్రజాప్రభుత్వంలో అన్నివర్గాలకి మేలు జరుగుతుందని, రాష్ట్రాభివృద్ధి-ప్రజాసంక్షేమం కోసం అంతా కలిసి పనిచేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య,పట్టణ పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, మండల పార్టీ అధ్యక్షుడు తోట పార్థసారథి, రాష్ట్ర టీడీపీ మైనారిటీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్, ఎల్ ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు గుంటి నాగరాజు తదితరులు ఉన్నారు.