ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకకు వెళ్లాడు. సింగపూర్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ) విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన అన్నా లెజినోవా కొణిదెలా నేడు తన డిగ్రీ పట్టా అందుకుంది. ఇక ఈ వేడుకకు తన భర్త ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.జయంత్ సి. పరాంజీ దర్శకత్వంలో వచ్చిన తీన్‌మార్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి నటించారు. ఈ సినిమా అనంతరం వీరి స్నేహం ప్రేమగా మారింది. దీంతో అన్నాను 2013లో పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. వీరికి పొలినా, మార్క్ అనే ఇద్దరూ పిల్లలు.