• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి : పవన్ కళ్యాణ్

admin by admin
July 10, 2024
in politics
0 0
0
అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి : పవన్ కళ్యాణ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిల్లో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఛైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు (వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియన్స్) కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పోరేట్లను భాగస్వాముల్ని చేయాలని, పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యచరణలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాలుపంచుకొనేలా చేసేందుకు ఉపముఖ్యమంత్రితో తేనీటి సేవనం (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జంతు ప్రదర్శన శాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, జోన్ల వారిగా జూపార్కుల ఏర్పాటు అంశంపై నివేదిక రూపొందించాలన్నారు. పర్యాటకం, పర్యావరణహిత పర్యాటక అభివృద్ధికి సంబంధించిన నమూనాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేద్దామని చెప్పారు. సమావేశంలో అటవీశాఖ పీసీసీఎఫ్ (హెచ్.ఒ.ఎఫ్.ఎఫ్.) శ్రీ చిరంజీవి చౌదరి, పర్యాటక శాఖ కమిషనర్ శ్రీ కె. కన్నబాబు, అటవీ శాఖ ఉన్నతాధికారులు శ్రీ ఎ.కె.నాయక్, డాక్టర్ శాంతిప్రియ పాండే, శ్రీ శరవణన్, డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు, శ్రీ శ్రీకాంతనాథ రెడ్డి, శ్రీ సి.సెల్వం, శ్రీమతి మంగమ్మ, శ్రీమతి ఎన్.నాగరాణి, ఎస్వీ యూనివర్శిటీ వెటరినరీ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ కె. వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Previous Post

“హలో బేబీ”కి పురస్కార్ నంది అవార్డు

Next Post

ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా… సారంగదరియా

Next Post
ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా… సారంగదరియా

ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా... సారంగదరియా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In