• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

వాయుగుండంగా మారిన అల్పపీడనం

admin by admin
July 19, 2024
in politics
0 0
0
వాయుగుండంగా మారిన అల్పపీడనం
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారినట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్న వాతావరణ శాఖ.. వాయవ్య దిశగా పయనించి శనివారం తెల్లవారుజామున పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

మరోవైపు వాయుగుండం తీరే దాటే క్రమంలో శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం,నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కాకినాడ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వీటితో పాటు బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యల కోసం మూడు ఎస్టీఆర్‌ఎఫ్, 2 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేసినట్లు రోణంకి కూర్మనాథ్ తెలిపారు.వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. అలాగే మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

Previous Post

భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Next Post

నియోజకవర్గ అభివృద్ధికి రాజిపడే ప్రసక్తే లేదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Next Post
నియోజకవర్గ అభివృద్ధికి రాజిపడే ప్రసక్తే లేదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి

నియోజకవర్గ అభివృద్ధికి రాజిపడే ప్రసక్తే లేదు - ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’
movies

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

by admin
September 16, 2026
0

...

Read more
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In