వరలక్ష్మి శరత్ కుమార్ టైటిల్ రోల్ లో ఘనంగా ప్రారంభంమైన ఓం శ్రీ “కనకదుర్గ” చిత్రం
నెక్స్ జెన్ పిక్చర్స్ పతాకంపై లంక ఫణిధర్ సమర్పణలో
సుమంత్ సైలేంద్ర , మేఘా ఆకాష్ జంటగా లంకా శశిధర్, స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్న ఓం శ్రీ “కనకదుర్గ” చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దైవ సన్నిదానంలో ఘనంగా జరిగాయి. ఈ చిత్రంలో గాడెస్ కనకదుర్గ గా వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు అంబికా కృష్ణ, డి. యస్. రావు, సైలేంద్ర బాబు, మురళి మోహన్, గోపి ఆచంట, దాము ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, శివ శక్తి దత్త నరసింహరాజు, డాక్టర్ ప్రదీప్ జోషి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం నిర్మాత సైలేంద్ర బాబు స్క్రిప్ట్ అందించగా ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత అంబికా కృష్ణ హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత డి. యస్. రావు గారు కెమెరా స్విచ్ ఆన్ చేయ్యగా.., డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గారు గౌరవ దర్శకత్వం వహించారు.ఈ కార్యక్రమం అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
*మురళీ మోహన్ గారు మాట్లాడుతూ..* లంక శివశంకర్ ప్రసాద్ గారు ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. చాలా ముఖ్యమైన పాత్ర ను ఇందులో చేస్తున్నాను, మంచి టైటిల్ తో, మంచి మనసు ఉన్న మనుషులతో వస్తున్న ఈ చిత్రం యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నాను.
*చిత్ర దర్శక, నిర్మాత లంకా శశిధర్ మాట్లాడుతూ..* ఇది నా మొదటి చిత్రం. నన్ను ఎంకరేజ్ చేసిన నా ఫ్యామిలీ మెంబెర్స్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మంచి కాన్సెప్ట్ ఉన్న కథను సెలెక్ట్ చేసుకొని తీయడం జరిగింది. భారీ గ్రాఫిక్స్ తో లవ్ & ఎంటర్ టైనర్ థ్రిల్లర్ గా తెరకేక్కుతుంది. మా చిత్రంలో నటించడానికి ఒప్ఫకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ చిత్రంలో మంచి ప్లానింగ్ కుదిరింది. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలలో ఈ సినిమా షూట్ చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తాము.
*నటుడు, నిర్మాత డి.యస్ రావు మాట్లాడుతూ..* అమ్మ వారి సినిమాను కమర్షియల్ వేలో తీస్తున్నామని నాకు డెమో చూయించారు. చూడగానే నచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ కు రిఫర్ చేయగా తనకి కూడా నచ్చడం చాలా సంతోషం. “బ్రాండ్ బాబు” చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ సైలేంద్ర కి జోడీగా మేఘా ఆకాష్ నటిస్తుంది. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా దర్శక, నిర్మాతలకు మంచి పేరు, లాభం రావాలని కోరుకుంటున్నాను.
*క్రియేటివ్ హెడ్ లంకా శివశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..* మా చిన్నబ్బాయి లంకా శశిధర్ కు సినిమా అంటే చిన్నప్పుటి నుండి ఎంతో ఇష్టం. దర్శకుడు అవ్వాలనే తన కల ఇప్పుడు విజయవాడ “కనకదుర్గమ్మ” పేరుతో లవ్ , ఎంటర్టైన్మెంట్ , & క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.
*సమర్పణ లంకా ఫణిధర్ మాట్లాడుతూ..* మంచి కమర్షియల్ చిత్రంగా త్వరలో సెట్స్ పైకి వెళుతున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
*డాక్టర్ ప్రదీప్ జోషి మాట్లాడుతూ..* సనాతన ధర్మాలు, హిందూ ధర్మాలతో అమ్మవారి తత్వాలు ప్రేక్షకులకు చూయించాలనే పట్టుదలతో నిర్మిస్తున్న సోషల్ ఫాంటసీ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను,ఇందులో మంచి పాత్రలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
*చిత్ర హీరో సుమంత్ సైలేంద్ర మాట్లాడుతూ..* ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది.., సీనియర్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్, మేఘా ఆకాష్ మురళి మోహన్ గారులతో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.
*చిత్ర హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ..* ఈ స్క్రిప్ట్ నాకు చాలాబాగా నచ్చింది. నా పాత్ర కూడా చాలా ఎగ్జయ్ టింగ్ గా ఉంటుంది. కొత్త మేఘాను చూస్తారు, మమల్ని, మా టీం అందరినీ ఆదరించి ఆశీర్వాదించాలని ప్రేక్షకులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
*స్టోరీ స్క్రీన్ ప్లే చేసిన నరేష్ అమరనేని మాట్లాడుతూ..* లంకా శశిధర్ తో, శివ శంకర్ గారితో నేను చాలా రోజులుగా ట్రావెల్ చేస్తున్నాను. ఈ కథ రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటుంది.. డివోషనల్ గా తీస్తున్నా ఈ చిత్రంలో ఫుల్ లవ్ & ఎంటర్ టైన్మెంట్ తో పాటు మంచి కామెడీ ఉంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ గారికి కథ విన్న వెంటనే నచ్చి చేస్తాను అన్నారు. హీరో, హీరోయిన్ లు ఇద్దరి పాత్రలు చాలా బాగా వచ్చాయి.
*డైలాగ్ రైటర్ హర శ్రీనివాస్ మాట్లాడుతూ..* ఇలాంటి మంచి సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. ప్రతి క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెంట్ ఉంటుంది, ఇది పక్క కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం.
*సినిమాటోగ్రాఫర్ శ్రీ చిత్ విజయన్ దామోదర్ మాట్లాడుతూ..* ఇలాంటి మంచి ప్రాజెక్ట్ లో నేను భాగం చేసినందుకు డైరెక్టర్ and ప్రొడ్యూసర్ గార్లకి ధన్యవాదములు.
ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నాము అని చెప్పారు.
నటీ నటులు
సుమంత్ సైలేంద్ర , మేఘా ఆకాష్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ మోహన్, డి.యస్.రావు తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : నెక్స్ జెన్ పిక్చర్స్
ప్రొడ్యూసర్, డైరెక్టర్ : లంకా శశిధర్,
స్టోరీ స్క్రీన్ ప్లే : నరేష్ అమరనేని
క్రియేటివ్ హెడ్ : లంక శివ శంకర్ ప్రసాద్
సమర్పణ : లంకా ఫణిధర్
లైన్ ప్రొడ్యూసర్ : జేత్రం మహేష్ రెడ్డి
కో డైరెక్టర్ : రవి బాబు వటుకూరి
అసోసియేట్ డైరెక్టర్ : కిషోర్ చుండూరి
మ్యూజిక్ డైరెక్టర్ : సామ్ కే. ప్రసన్
సినిమాటోగ్రఫి : శ్రీ చిత్ విజయన్ దామోదర్
ఎడిటర్ : శ్యామ్ వడవల్లి
లిరిక్స్ : శివ శక్తి దత్త, లక్ష్మి ప్రియాంక, తనికెళ్ళ శంకర్
ప్రొడక్షన్ కంట్రోలర్ : నార పెంచలయ్య
డైలాగ్స్ : హర శ్రీనివాస్
పి.ఆర్.ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు
Varalaxmi Sarathkumar in and as Kanaka Durga; movie launched grandly
Staring Megha Aaksh and Sumanth Sailendra in lead roles, directed by Lankaa Sasidhar and presented by Lanka Phanidharr, ‘Kanaka Durga’ film got launched today in Hyderabad. The speciality of the film is that Varalaxmi Sarathkumar is playing the titular role and expectations are already high on this flick which will be made as a Pan India film in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.
Producers Ambika Krishna, D.S. Rao, Sailendra Babu, Murali Mohan, Gopi achanta, daamu prasad, Dr. Pradeep Joshi and others participated. After the puja programs, producer Sailendra Babu presented the script and producer Ambika Krishna, the chief guest, clapped for the first scene of the hero and heroine. Producer D.S. Rao switched on the camera, Kashi Viswanath, the President of Directors Association was the director the honor.
Many celebrities attended the event. Popular actor and filmmaker Murali Mohan said…
“Lanka Sivashankar Prasad has done many films in the past and all of them are family entertainers. I sincerely wish that this film unit and the cast, who have come up with such good title succeed and win at the box office.”
Film director and producer Lankaa Sasidhar said.. “This is my first film. I am thankful to my family members who always supported me. A story with a good concept has been selected and shot. It will be a love & entertainer thriller with graphics on a large scale. Thanks to Varalakshmi Sarath Kumar who agreed to act in our film. We will shoot this film in Hyderabad, Vijayawada and other places . It will be brought to the audience soon.”
Actor and Producer D.S Rao said, “I was given a demo on how this film in goddess is being made and I loved it the minute I saw it. I am very happy that Varalakshmi Sarath Kumar also liked it. Megha Akash will act opposite Sumanth Sailendra, who gained fame with the movie “Brand Babu”. I want the director and producer of this movie which is being made with a good concept to get a good name.”
Creative Head Lanka Sivashankar Prasad said.. “Our beloved Lanka Sasidhar is very fond of cinema since childhood. In order to fulfill his dream, he is now producing and directing this movie titled “Kanakadurga” as a love, entertainment, & thriller. All the best to the team.”
Doctor Pradeep Joshi said, “We are making this film to show the culture, Hinduism and a lot of history to the audience. I am glad to be part of this film which has given me such a good role.”
Hero Sumanth said, ” I loved the story and script. Happy to be working with actresses like Varalaxmi Sharath Kumar and Megha Akash. I thank the director and producer for giving me the opportunity.”
Heroine Megha said, “My character in the film really excited me and that’s why I said yes to it. Very happy to be part of this film and looking forward to the shoot.”
Naresh Amaraneni, who worked on the story and screenplay of the film also said, “This story is very different. It’s a devotional film that is differently done. It is full of entertainment and story that will make you love it. Varalaxmi said yes to the film immediately after narration. ”
Dialogue writer Hara Srinivas said, “I wrote the dialogues keeping the goddess in mind. I thank the makers for the opportunity.”
Cinematographer Srichit Vijayan Damodar said he’s glad to be part of this amazing team that’s making a good film.
Every celebrity who attended the event is all praises for the cast and crew for coming up with such a good story.
Cast:
Sumanth Sailendra, Megha Akash, Varalakshmi Sarath Kumar, Murali Mohan, DS Rao and others.
Technical experts
Banner : Next Gen Pictures
Producer, Director : Lankaa Shasidhar,
Story Screenplay : Naresh Amaraneni
Creative head : Lanka siva sankar prasad
Presents : Lanka phanidharr
Line Producer :
Jetram Mahesh Reddy
Co Director : Ravi Babu Watukuri
Associate Director : Kishore Chunduri
Music Director : Sam K. Prasan
Cinematography : Shri Chit Vijayan Damodar
Editor : Shyam Vadavalli
Lyrics : Shiva Shakti Dutta, Lakshmi Priyanka, Tanikella Shankar
Production Controller : Nara Penchaliah
Dialogues : Hara Srinivas
P. R. O : Sai Satish, Parvataneni Rambabu