విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ‘తీస్ మార్ ఖాన్’
విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 3 గా ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి “తీస్ మార్ ఖాన్” సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆది సాయి కుమార్ హీరోగా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా “నాటకం” వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19న భారీ ఎత్తున రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్లా సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది.
“తీస్ మార్ ఖాన్” సినిమా మీద విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా చిత్రం ఉందని అంటున్నారు. ఇక ఇందులో ఆది సాయి కుమార్ నటన, యాటిట్యూడ్, యాక్షన్ ఇలా అన్నీ కూడా హైలెట్ అయ్యాయి. పాయల్ రాజ్‌పుత్ అందాలు సినిమాకు ప్లస్ అయ్యాయి. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అంటూ రివ్యూలు సైతం వచ్చాయి. సాయి కార్తీక్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మేజర్ అస్సెట్‌గా నిలిచిందని ప్రశంసలు కురిపించారు. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచాయని పొగడ్తలు కురిపించారు.
నిర్మాత డా. నాగం తిరుపతిరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఖర్చు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపించింది. తీస్ మార్ ఖాన్ సినిమా మాస్ ఆడియెన్స్‌కు కొత్త ఫీలింగ్ ఇస్తుంది.