కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ డిన్నర్‌మీట్ కాబోతున్నారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ డిన్నర్‌కు వెళ్తున్నారు. 15 నిమిషాల పాటు ఇద్దరి సమావేశం జరగనుంది. ఇటీవల ట్రిపులార్ సినిమాను చూశారు కేంద్ర మంత్రి అమిత్ షా. అందులో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యారు. దీంతో.. ఆయనతో మాట్లాడాలని అమిత్‌షా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా – ఎన్టీఆర్ లంచ్ మీటింగ్ జరగబోతోంది. ఇదే సమావేశంలో సినిమాతోపాటు పలు రాజకీయ అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
రాజకీయం లేకుండా ఉంటుందా!?