అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే , పి ఏ సి చైర్మన్ పయ్యావుల కేశవ్ తన సొంత గ్రామం పెద్ద కౌకుంట్ల లో ఆదివారం తన సొంత వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులలో బిజీ బిజీగా గడిపారు. పంచి కట్టు కొని రైతు గా మారాడు. వరి పంట సాగు చేయడానికి సిద్ధం చేసిన, పొలంలో సొంతంగా టాక్టర్ నడుపుతూ భూమిని దున్నారు. అదేవిధంగా తన పొలం ప్రక్కనే ఉన్న మరో రైతు పొలంలో కాడెద్దులతో భూమిని దున్నారు. పొలాలలో ఉన్న రైతులతో సరదాగా గడిపారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.