రాజధాని అమరావతిలో లింగాయపాలెం మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య లో నిల్వ ఉంచిన గ్రావెల్ మట్టిని రాత్రికి రాత్రి అక్రమ మైనింగ్ మాఫియా దారులు తవ్వుకొని వెళ్ళటం జరిగింది. లారీ దిగబడి పోవటంతో అక్కడే కొన్ని వస్తువులను వదిలేసి పారిపోయిన మైనింగ్ మాఫియా ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న దళిత జేఏసి అమరావతి నాయకులు ఈ సంఘటన ను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో తుళ్లూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముళ్ళమూడి రవికుమార్ మాట్లాడుతూ రాజధాని అమరావతి లో మైనింగ్ మాఫియా గత కొద్ది రోజులుగా నిద్ర నటించి ఒక్కసారి గా రాత్రి 10 టైర్ల లారీలతో క్రేన్ లతో గ్రావెల్ దోచుకోవటం జరిగింది ఈ పోలీసు వ్యవస్థ ఇంటిలిజెన్స్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ నిద్ర నటిస్తూ చూసి చూడనట్టు వదిలేయటం వల్ల ఈ మైనింగ్ మాఫియా రాజధాని అమరావతిలో రెచ్చిపోతుంది అని అన్నారు. దళిత జేఏసీ అమరావతి నాయకులు పులి చిన్న మాట్లాడుతూ వైసీపీ నాయకులే రాజధాని అమరావతి లో లారీలు ట్రాక్టర్లతో ఏది దొరికితే అది దోచుకొని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. త్వరలో రాజధాని అమరావతిలో ఉన్న పెద్ద పెద్ద పైపలు కూడా మాయం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు అన్నారు దళిత జేఏసీ అమరావతి కో కన్వీనర్ చిలకా బసవయ్య మాట్లాడుతూ దొంగలు పోలీసులు ఏకమై రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ రాజదాని ఆస్తులు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు ప్రభుత్వ సలహాదారు లకు జీతాలు చెల్లించలేక ప్రభుత్వమే ఇలా అక్రమ మైనింగ్ మాఫియా పనులు చేయిస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ మాఫియా ను అరి కట్టక పోతే హైకోర్టు వారిని ఆశ్రయిస్తాం అని అన్నారు దళిత జేఏసి అమరావతి ప్రధాన కార్యదర్శి తోకల రాజ వర్ధన్ రావు మాట్లాడుతూ 5 వేల కోట్ల రూపాయల విలువ గలిగిన ఆస్తి అమరావతి రోడ్లపై ఉన్నది దానిని దోచుకోవడమే ఈ వైసీపీ నాయకుల పనిగా మారింది అన్నారు. అమరావతి ఆస్తులను కాపాడుకుంటాం అని నినాదాలు చేశారు.