రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ గారు నా మగతనం గూర్చి ఎక్కువగా ప్రస్తావిస్తోందని నా మగతనంతో మీకేం పని మంత్రి గారు అంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఎద్దేవా చేశారు. రాయదుర్గంలో తలపెట్టిన బీటీపీకు పాదయాత్ర సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు ఇంటికి వెళ్లిన ఉమామహేశ్వర నాయుడు ఇతర నాయకులను పోలీసులు అడ్డగించారు. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన నాయకులు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ప్రస్తుత రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీ చెరువులను పూడ్చివేసే కార్యక్రమం నిర్వహిస్తోందని దీన్ని ప్రశ్నించడంతో నా మగతనం గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందని నా మగతనంతో మీకేం పని మంత్రి గారు అంటూ ఉమా ఎద్దేవా చేశారు. నా మగతనం సంగతి పక్కన పెడితే కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని 114 చెరువులు కు నీరు అందివ్వకున్నా పర్వాలేదని ఉన్న చెరువులను పూడ్చివేయకుండా కాపాడాలని ఉమామహేశ్వర నాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తలారి సత్యప్ప, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి విరుపాక్షి, ఐటీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పర్వతనేని మధు,ఐటీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదిమూలం మంజు తదితరులు పాల్గొన్నారు.