అనంతపురం, జనంతో డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు వినూత్న కార్య క్రమాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అందులో భాగంగానే ముస్లింలు పవిత్రంగా భావించే బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్గా.. మసీదుల వద్ద పోలీస్ సిబ్బందితో కలసి స్వీట్లు, చాక్లెట్లు పంపిణీ
బక్రీద్ సందర్భంగా పోలీసులు రక్తదానం
అందరినీ అభిమానాన్ని చూరగొన్నారు. విధి నిర్వ హణలో నీతి, నిజాయతీ, నిబద్ధతతో పని చేస్తూ పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన బాధితుల గుండెల్లో నిలచిపోయారు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం… ఇలా అన్ని మతాలకు సంబంధించి వారి వారికి సంబంధించిన పవిత్ర రోజుల్లో ఆయా ప్రార్థనా స్థలాల వద్దపువ్వులు ఇచ్చి స్వాగతం చెప్పడం, స్వీట్లు, పిల్లలకు చాక్లెట్లు పంచుతూ ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటున్నారు.
అన్ని మసీదుల వద్ద బందోబస్తు సిబ్బందితో ఒక వైపు దక్షణ కల్పించి, మరోవైపు స్వీట్లు, చాక్లెట్లు ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు.
మత సామరస్యానికి నిలువెత్తు సాక్షిగా డీఎస్సీ శ్రీనివాసులు నిలుస్తున్నారు. శభాష్.. శ్రీనివాసులు సర్. అంటూ ముస్లింల ప్రశంసలు అందుకున్నారు.