ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు నార్నే నితిన్ ( జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు) కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు’ టైటిల్ ఖరారు చేశారు. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్‌పై రామారావు చింతపల్లి మరియు MS రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 2017లో “శతమానం భవతి” సినిమా తీసి నేషనల్ అవార్డు గెలుచుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న వేగేశ్న సతీష్ దీనికి దర్శకత్వం వహించారు.
చిత్ర హీరో నితిన్ నటనలో పూర్తి శిక్షణ తీసుకున్న తరువాతే “శ్రీశ్రీశ్రీ రాజా వారు” వంటి విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.’శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భంగా ఈ రోజు హీరో నార్నే నితిన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆలయ ఉత్సవాల నేపథ్యంలో సృజనాత్మ కంగా రూపొందించిన పోస్టర్ లో సైడ్ పోజ్‌లో చూపబడిన నార్నే నితిన్, రెడ్ చెక్స్ ఫుల్ హ్యాండ్ షర్ట్, జీన్స్ ప్యాంట్ మరియు స్పోర్ట్స్ షూస్‌తో రగ్గడ్ లుక్‌లో ఉన్నాడు. జాతరలో స్టైల్‌గా సిగరెట్ వెలిగిస్తున్న నార్నే నితిన్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. అక్షరాలను సిగరెట్‌లా డిజైన్ చేయడంతో సినిమా లోగో క్యూరియాసిటీ ని మరింత పెంచింది.”‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయ మవుతున్న నార్నే నితిన్ కు మీ (ప్రేక్షకుల) ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని దర్శకుడు సతీష్ వేగేశ్న పేర్కొన్నారు.
అలాగే ఈ చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేస్తారు.
నటీనటులు
నార్నే నితిన్ చంద్ర, నరేష్ V.K, రావు రమేష్, ప్రవీణ్, సుదర్శన్, భద్రం, అనంత ప్రభు, ప్రియా మాచిరాజు, నిహారిక సతీష్, మీనా కుమారి, రచ్చ రవి తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : శ్రీవేదాక్షర మూవీస్, నిర్మాతలు : రామారావు చింతపల్లి, ఎం.ఎస్.రెడ్డి, దర్శకుడు : సతీష్ వేగేశ్న, డి.ఓ.పి : ధాము నర్రావుల, సంగీతం : కైలాస్ మీనన్, ఎడిటర్ : మధు, ఆర్ట్స్ : రామాంజనేయులు, ఫైట్స్ : రియల్ సతీష్, లిరిక్స్ : శ్రీ మణి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : రాజేష్ దాసరి, లైన్ ప్రొడ్యూసర్ : రాజీవ్ కుమార్ రామ, డిజిటల్ పి.ఆర్ : విష్ణు తేజ్ పుట్ట, పి.ఆర్.ఓ : నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)