రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ ప్రభుత్వమే వస్తుందని మరోసర్వే తేల్చి చెప్పింది. జగన్ ను ఓడించడానికి కూటమిగా ఏర్పడిన పార్టీలు… కనీసం జగన్ దరిదాపుల్లోకి కూడా రాలేవని ఈ సర్వే తేల్చింది. ఎలెక్ సెన్స్ అనే సంస్థ.. ఈ ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 మధ్య సుమారు 86,200 మందిని సర్వే చేయగా… 50.38శాతం మంది జగన్ ప్రభుత్వమే వస్తుందని తేల్చిచెప్పారు. ఈ లెక్కన వైసీపీకి 127 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆ సర్వే అంచనా వేసింది. కూటమికి 45.58 శాతం ఓట్లతో కేవలం 48 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. అంటే వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ఖాయమని తెలుస్తోంది.
నిత్యం జగన్ తిడుతూ తిరుగుతున్న షర్మిల నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.38 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని, సీట్లు మాత్రం ఒక్కటి రావని తేల్చేసింది. ఇక ఎటూ తేల్చుకోలేని, నోటా, ఇతర చిన్నా చితకా పార్టీలకు 2.66శాతం ఓట్లు దక్కుతాయని ఈ సర్వేలో తేలింది. … సో దీన్ని బట్టే అర్థమవుతోంది… రాష్ట్రంలో మరోసారి సంక్షేమం కోసం పాటుపడే పార్టీకే పట్టం కట్టబోతున్నారని. ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు పైఎత్తులు… పొత్తులతో వచ్చినా… జగన్ మళ్లీ అధికారం చేపట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Elecsense Survey for Andhra Pradesh Assembly Election
It’s YSJagan Again
YSRCP : 127 (50.38%)
TDP+ : 48 (45.58%)
INC : 00 (1.38%)
OTH : 00 (2.66%)
As per this survey CM Jagan Reddy will be re-elected to power.
Survey was done from 25th March to 12th April.
Sample Size : 86,200