శ్రీ చైతన్య విద్యాసంస్థలలో అధిక ఫీజులు వసూలు అరికట్టాలని పుస్తకాల పేర్లతో వేలాది రూపాయల వసూలు అరికట్టాలని విజయవాడ నగరంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన కేసులు నమోదు చేయడాని నిరసిస్తూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎదుట ఆందోళన కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో శ్రీ చైతన్య కళాశాల ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ.కుల్లాయిస్వామి జి.చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్రంలో చైతన్య విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మారుస్తున్న కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడం చాలా సిగ్గుచేటు అన్నారు.ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు పట్టిక ఉన్నా కూడా చైతన్య విద్యా సంస్థలు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కళాశాల పేర్లతో ముద్రించిన పాఠ్యపుస్తకాలను వేలాది రూపాయలకు కళాశాలలోనే కొనాలని నిబంధన పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.ఇంత పెద్ద మొత్తంలో విద్యాదోపిడీ చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోకుండా విద్యా దోపిడీని అరికట్టాలని ఆందోళన చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన ఎందుకు కేసులు నమోదు చేశారని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాశాఖ అధికారులు ఆర్ ఐ ఓ గారు డీఈఓ గారు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఇచ్చే ముడుపుల మత్తులో పడి,శ్రీ చైతన్య విద్యాసంస్థలు విద్యా దోపిడీ చేస్తున్న కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.అలాంటి అధికారుల పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యను ఒక దోపిడీలాగా తయారు చేస్తున్న శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యలు నాగేంద్ర మురళీకృష్ణలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.విజయవాడ పోలీస్ యంత్రాంగం ఫీజుల రూపంలో విద్యదోపిడీ చేస్తున్న వారిని వదిలేసి,వారిని ఎసి రూములలో కూర్చోబెట్టి,విద్యాదోపిడి అరికట్టాలని ప్రశ్నిస్తున్న ఎఐఎస్ఎఫ్ నాయకులను అరెస్టు చేసి కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.విజయవాడలో చైత్యన విద్యాసంస్థలకు వత్తాసుగా పని చేయకుండా, మీ విధులు మీరు సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.విజయవాడ నగరంలో ఎఐఎస్ఎఫ్ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి రమణయ్య జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణ నగర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమామహేష్,సహాయ కార్యదర్శిలు ఆనంద్,వంశీ, నాయకులు లోకేష్, రాజేష్,చిన్న, సమీర్,రమణ,పవన్,సాయి,కార్తీక్, రాజు,వేణు,శంకర్,ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు.