కరోనా బాధితుల మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు కరోనా టెన్షన్ పెడుతోంది.. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా మహమ్మారి బారినపడ్డారు.. గుంటూరు జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు తాజాగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలగా.. ఇక, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కి కూడా కోవిడ్ సోకింది.. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు.. ఈ మధ్య తమను కలిసినవారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని.. కరోనా మహమ్మారి బారినపడకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు మేకతోటి సుచరిత, ఆర్కే.
కాగా, కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. సాధారణ ప్రజల నుంచి వీఐపీ, వీవీఐపీల వరకు అందరినీ పలుకరిస్తూనే ఉంది.. ఇప్పటికే కరోనా బారిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా వేలాది మందికి కోవిడ్ సోకింది.. అందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ రూపంలో ఇప్పటికే ఎంతోమందిని ఇబ్బంది పెట్టిన ఆమహమ్మారి.. ఇప్పుడు మళ్లీ కరోనా ఫోర్త్ వేవ్ రూపంలో పంజా విసురుతోంది.. దీనిపై అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.