విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబైలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న వరల్డ్‌కప్ సెమీస్‌లో కోహ్లీ సెంచరీ చేసి కెరీర్లో 50వ శతకం పూర్తి చేశాడు. విరాట్ 106 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 100 రన్స్ చేసి సెంచరీ సాధించాడు. ఈ సెంచరీతో వన్డేల్లో సచిన్ పేరిటున్న అత్యధిక శతకాల (49) రికార్డును విరాట్ బద్దలకొట్టాడు.