పూర్తి సరికొత్త TVS RONIN ను తెలంగాణాలో విడుదల చేసిన టీవీఎస్ మోటర్ కంపెనీ ;
పరిశ్రమలో మొట్టమొదటి ‘modern-retro’ మోటర్ సైకిల్ విడుదల చేయడం ద్వారా ప్రీమియం లైఫ్ స్టైల్ విభాగంలో ప్రవేశించింది.
మోటర్ సైక్లింగ్ ప్రపంచంలో తమదైన సొంత విభాగం సృష్టించడం కోసం టీవీఎస్ మోటర్ నుంచి వస్తోన్న మొట్టమొదటి ప్రీమియం లైఫ్ స్టైల్ ఆఫరింగ్ TVS RONIN..
• జీవితాన్ని తమకు నచ్చిన రీతిలో జీవించాలనుకునే వ్యక్తుల కోసం శైలి, సవారీ సౌకర్యం, సాంకేతికత యొక్క ఖచ్చితమైన సమ్మేళనంగా TVS RONIN నిలుస్తుంది.
• ఇది మరో మోటర్ సైకిల్ అనే దానికంటే ఎక్కువగా TVS RONIN ఉంటుంది. ప్రపంచశ్రేణి మర్చండైజ్, యాక్ససరీలు, కాన్ఫిగరేటర్, పూర్తిగా అంకితం చేసిన ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్తో వైవిధ్యమైన వ్యవస్థను అందిస్తుంది.
హైదరాబాద్, 21 జూలై 2022 అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన ద్విచక్ర మరియు మూడు చక్రాల వాహన తయారీదారు టీవీఎస్ మోటర్ కంపెనీ నేడు ప్రీమియం లైఫ్ స్టైల్ విభాగంలో ప్రవేశిస్తూ పరిశ్రమలో మొట్టమొదటి మోడ్రన్ – రెట్రో మోటర్సైకిల్: TVS RONIN ను నేడు హైదరాబాద్లో ఆవిష్కరించింది. సంపూర్ణంగా డిజైన్ చేసిన TVS RONIN ఓ జీవనశైలి ప్రకటనను అందిస్తుంది. ఆధునిక, నూతన యుగపు రైడర్ నుంచి ఇది స్పూర్తిని తీసుకుంటుంది. ఈ TVS RONIN ను శైలి, సాంకేతికత మరియు సవారీ అనుభవాలతో తీర్చిదిద్ది లిఖించనటువంటి జీవనశైలిని ప్రోత్సహించనున్నారు.
టీవీఎస్ మోటర్ యొక్క మహోన్నతమైన 110 సంవత్సరాల వారసత్వం, అగ్రగామి సాంకేతికత, ఆవిష్కరణలను నూతన మార్గపు జీవనపు ఆవిష్కరణ TVS RONIN తో మరింత ముందుకు తీసుకువెళ్లనున్నారు. ప్రీమియం లైఫ్ స్టైల్ మోటర్ సైక్లింగ్ విభాగంలో కంపెనీ యొక్క ప్రవేశానికి గుర్తుగా.. ఈ మోటర్ సైకిల్ నూతన విధానపు సవారీని తీసుకురావాలనే తమ నిబద్ధతను విస్తరిస్తోంది. TVS RONIN యొక్క వైవిధ్యమైన ఫీచర్లు, వినూత్నమైన డిజైన్ మరియు ఆధునిక సాంకేతికతల సమ్మేళనంగా ఉండటంతో పాటుగా ఒత్తిడి లేని సవారీ అనుభవాలను అన్ని భూభాగాలలో అందిస్తుంది. ఈ మోటర్సైకిల్లో మొట్టమొదటి సారిగా ఎన్నో వినూత్న ఫీచర్లను ఆకర్షణీయమైన సాంకేతికత, సౌకర్యవంతమైన ఫీచర్లు అయినటువంటి డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్, వాయిస్ అసిస్టెన్స్, మెరుగైన కనెక్టివిటి ఉన్నాయి. ఈ విభాగంలో.. మొట్టమొదటి సారిగా TVS RONIN ను ప్రత్యేక శ్రేణిలో బ్రాండెడ్ ప్రపంచశ్రేణి మర్చండైజ్, అనుకూలీకరించిన యాక్ససరీలు, కాన్ఫిగరేటర్ మరియు పూర్తిగా అంకితం చేసిన ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్తో విడుదల చేశారు.
-టీవీఎస్ మోటర్ కంపెనీ హెడ్. బిజినెస్, ప్రీమియం శ్రీ విమల్ సుంబ్లీ మాట్లాడుతూ “అంతర్జాతీయ
స్థాయిలో మోటర్ సైక్లింగ్ మారుతుంది. అవసరాలను తీర్చడం మాత్రమే అనే విధానం నుంచి స్వీయ వ్యక్తీకరణ, స్వేచ్ఛ, అన్వేషించాలనే కోరికను సైతం సాధ్యం చేస్తుంది. మా వినియోగదారుల అస్క్రిప్టెడ్ ప్రయాణాలను తీర్చిదిద్దుతూ ఇప్పుడు TVS RONIN నూతన విభాగాన్ని మూసధోరణులు, డేటెడ్ కోడ్లు, వారసత్వపు బ్యాగేజీల నుంచి విముక్తి చెందుతున్న జీవనశైలి ఆధారంగా సృష్టిస్తోంది. ఇది ప్రీమియమైజేషను పర్సనలైజేషన్ మరింతగా మార్చడం ద్వారా ద్విచక్ర వాహన విభాగంలో నూతన ధోరణిని సృష్టిస్తోంది. ఈ మోటర్ సైకిల్ ప్రీమియం జీవనశైలి అనుభవాలను మా వినియోగదారులకు తీసుకురావడంతో పాటుగా వైవిధ్యమైన బ్రాండ్ పర్యావరణ వ్యవస్థను సైతం అందిస్తుంది. మా వినియోగదారులు వైవిధ్యమైన సవారీ లక్షణంతో కూడిన ఈ మోటర్ సైకిల్ను అభిమానించగలరనే నమ్మకంతో ఉన్నాము” అని అన్నారు.
TVS RONIN మూడు వేరియంట్లు లో లభిస్తుంది. అవి 1,49,000 రూపాయలలో (ఎక్స్ షోరూమ్ తెలంగాణా) TVS RONIN SS, 1,58,500 రూపాయలలో (ఎక్స్ షోరూమ్ తెలంగాణా) TVS RONIN DS మరియు టాప్ వేరియంట్ 1,68,750 రూపాయలలో (ఎక్స్ షోరూమ్ తెలంగాణా) TVS RONIN TD.
నూతన TVS RONIN లో ప్రధాన ఆకర్షణలు
పూర్తి నూతన జీవనశైలి
• అన్ని భూభాగాలలోనూ సౌకర్యవంతమైన సవారీ అనుభవాలు
TVS RONIN CULT – ఇక్కడ సంస్కృతి, జీవనశైలి మరియు ప్రయాణాలు సజీవంగా ఉంటాయి.
డిజిటల్ సవారీ అనుభవం
సౌకర్యవంతమైన అనుకూలీకరణ కోసం కాన్ఫిగరేటర్
SmartXonnect తో డిజిటల్ క్లస్టర్
TV ARIVE యాప్ ద్వారా ఏఆర్ అనుభవాలు
ప్రత్యేకమైన మర్చండైజ్ మరియు యాక్ససరీలు
విస్తృతశ్రేణి మర్చండైజ్ మరియు సవారీ గేర్
ప్రత్యేకమైన యాక్ససరీలతో క్యూరేటెడ్ కిట్స్
TVS RONIN యొక్క కీలకమైన ఫీచర్లు
శైలిలో నూతన కథ
• పూర్తి ఎస్ఈడీ ల్యాంప్స్
• సిగ్నేచర్ టీ – ఆకృతి పైలెట్ ల్యాంప్
అసమానమైన స్పీదో మీటర్
ఎగ్జాస్ట్ మరియు మఫ్లర్ డిజైన్
• చైన్ కవర్
• 3 స్పోక్ అల్లాయ్ వీల్స్
• బ్లాక్ బ్రెడ్ టైర్స్
అత్యాధునిక సాంకేతికత
• డిజిటల్ క్లస్టర్ (డీటీఈ డిస్టెన్స్ టు ఎంప్లీ, ఈజీఏ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ ఎడ్రైవర్, గేర్ షిఫ్ట్ అసిస్ట్, సైడ్ స్టాండ్ ఇంజిన్ ఇన్హిబిటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్)
• వాయిస్ అసిస్ట్
• టర్మ్ టర్న్ నేవిగేషన్
కస్టమ్ విండో నోటిఫికేషన్
• TVS SmartKonnect యాప్ పై సవారీ విశ్లేషణ
సౌకర్యవంతమైన అనుభవాలతో కూడిన సవారీ • రెయిన్ మరియు అర్బన్ ఏబీఎస్ మోడ్స్
• ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ఐఎస్బీ)- అతి తక్కువ శబ్దంతో కూడిన ఫెదర్ టచ్ స్టార్ట్
• అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ (యుఎస్ఓ)
• రియర్ మోనోషాక్
• గైడ్ త్రూ టెక్నాలజీ (జీటీటీ)
అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్
3- స్టెప్ ఎడ్జస్టబల్ లీవర్