తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు.. ఎన్టీఆర్ హయాంలో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో స్థాపించిన ఈ పార్టీ ప్రస్తుతం సొంత గౌరవాన్ని కూడా కాపాడుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతోంది. టిడిపి అధినేత చంద్రబాబు చేసిన దారుణమైన మోసం గురించి ప్రస్తావిస్తూ టిడిపి కార్యకర్తలు ఈరోజు ఆందోళనకు దిగారు. అరకులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు కి.. ఈ విషయంలో చేదు అనుభవం ఎదురయింది.
సొంత పార్టీ నేతలు నిరసనకు దిగడంతో అక్కడ పరిస్థితి కాస్త అదుపు తప్పింది. తాజాగా అరకు పర్యటనకు వెళ్లిన నక్క ఆనంద్ బాబు ను అక్కడ టిడిపి నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. టిడిపిలో ఎంతో కాలం నమ్మకంగా ఉన్న నేత అబ్రహం కుటుంబానికి అన్యాయం చేశారు అంటూ నినాదాలు చేయడమే కాకుండా నిరసనకు దిగారు.
ఈ సంఘటనతో అరకు నియోజకవర్గంలో టిడిపి అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి. యువగళం పాదయాత్ర విజయాన్ని పురస్కరించుకొని టిడిపి విస్తృతస్థాయిలో సమావేశం అరకులో నిర్వహించింది. దీనికి వెళ్లిన నక్క ఆనందబాబు.. అక్కడ టిడిపి నేతల మధ్య గొడవలు జరగడంతో షాక్ అయ్యారు. ప్రస్తుతం అరకు ఇన్చార్జిగా దొన్ను దొరను నియమించడంపై అబ్రహం అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు చేతిలో మృతి చెందిన టిడిపి మాజీ ఎమ్మెల్యే సోము కొడుకు ఆయన అబ్రహాం కు టికెట్ ఇస్తాము అని ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశాడు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు.
అయినా ఇటువంటి తెరవెనక రాజకీయం టిడిపిలో కొత్త కాదు కదా. ప్రతిసారి వాగ్దానం ఇవ్వడం గడిచిన తర్వాత ఆ ప్లేటు ఫిరాయించడం ఆ పార్టీలో కామన్ అయిపోతుంది. అందుకే ఈసారి గట్టిగా తమ కాలం అధిష్టానం వరకు వినిపించాలి అని గట్టిగానే నిరసనకు దిగారు అరకు టిడిపి కార్యకర్తలు. మరి ఈ విషయంలో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.