నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టక్కర్’. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో భాగంగా “టక్కర్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకులు బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్ మరియు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా….
*లెజండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ…*
విశ్వప్రసాద్ గారు , వివేక్ గారు నాకు మంచి ఫ్రెండ్స్, సిద్దార్థ్ నాకు చాలా కాలం నుండి మంచి ఫ్రెండ్. ఐ విష్ హిమ్ అల్ ద బెస్ట్. బొమ్మరిల్లు భాస్కర్ , తరుణ్ భాస్కర్ , వెంకటేష్ అందరు నాకు మంచి ఫ్రెండ్స్. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
*దర్శకుడు తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ….*
ఇక్కడికి రావడం చాలా హ్యాపీ గా ఉంది. సిద్దార్థ్ గారు ఈ జనరేషన్ కమల్ హాసన్ లా అనిపిస్తారు. సిద్దార్థ్ అప్పటికి ఇప్పటికి అలానే ఉన్నారు. ట్రైలర్ చాలా బాగుంది, తప్పకుండా సినిమా థియేటర్ కి వెళ్లి చూద్దాం.
*దర్శకుడు కార్తీక్ జి. క్రిష్ మాట్లాడుతూ….*
ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి , టీజీ విశ్వప్రసాద్ , వివేక్ గారికి అందరికి నమస్కారం. ఈ సినిమాలో యూనివర్సల్ కంటెంట్ ఉంది.
ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి మూడు కారణాలు, మొదటది మీ సిద్దార్ధ్ , తరువాత దివ్యాంశ. మా గురువు గారు శంకర్ సినిమాలకు బ్రహ్మరథం పట్టారు తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడే అదే బాటలో శిష్యుడు సినిమాను కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ కాలానికి ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది. ఈ సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చెయ్యండి.
*హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ మాట్లాడుతూ…*
ఈ సినిమా జూన్ 9న రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్ లో ఈ సినిమాను ఎక్సపీరియన్స్ చెయ్యండి. థాంక్యూ సో మచ్.
*ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..*
సురేష్ బాబు గారికి కృతజ్ఞతలు. నేను అమెరికాలో పది సంవత్సరాలు నుంచి ఉంటున్నాను. సినిమాలు డీవిడిలో చూడటం దగ్గరనుంచి థియేటర్ లో నేను చూసిన మొదటి సినిమా బొమ్మరిల్లు. అప్పటినుంచి సినిమాలు థియేటర్ లో చూడటం అలవాటు.
ఇప్పుడు అంతా పాన్ ఇండియా ఎరా నడుస్తోంది. మేము సుభాన్ గారితో కలిసి త్వరలో తెలుగులో సినిమాను నిర్మించబోతున్నాం అన్నారు.
*నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ…*
మేము ఈ సినిమాతో అసోసియట్ అయినందుకు చాలా హ్యాపీ గా ఉంది. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది అని ఆశిస్తున్నాను.
*హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ…*
అందరికి నమస్కారం, టక్కర్ సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను మంచి స్కేల్ లో తీశారు. ఇది ఒక యాక్షన్ ఫిల్మ్ ఈ యాక్షన్ స్టోరీ మధ్యలో ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ ను చూపించారు కార్తీక్ జి. క్రిష్ గారు.
ఈ సినిమాలో లవర్ బాయ్ రగ్గడ్ గా ఉంటే ఎలా ఉంటుందో చూపించారు.
ఇక్కడికి వచ్చిన అతిధులు అందరికి థాంక్యూ సో మచ్. నేను రామానాయుడు గారితో చాలా సార్లు మాట్లాడాను. నాకు సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. సురేష్ బాబు గారి వచ్చి ఈ టీం ను బ్లేస్ చేసినందుకు థాంక్యూ సో మచ్. తెలుగు సాహిత్యం , తెలుగు కవిత్వం చూసి , చదివి అది నా లోపలకి వెళ్ళిపోయింది. సో నేను చెప్పిన చెప్పకపోయినా తెలుగు బిడ్డే. జూన్ 9న టక్కర్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా 100% అలరిస్తుంది. త్వరలో నేను 6 సినిమాలు రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. టెక్నీకల్ టీం కి థాంక్యూ సో మచ్. దివ్యాంశ కి ఈ సినిమా తరువాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది.
అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సిద్దు ఎప్పుడు చేస్తారు అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా అన్నారు.