టక్కర్ యూనిక్ లవ్ స్టోరీ ఉన్న ఒక సినిమా – హీరో సిద్దార్థ్
* ఆద్యంతం సరదాగా జరిగిన టక్కర్ మీడియా మీట్
నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రొమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ వివరాల్లోకి వెళితే….
సహనిర్మాత వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ…
ఈ సినిమా మంచి కంటెంట్, సిద్దార్థ్ గారు మంచి పెరఫార్మర్, ఈ సినిమా సిద్దార్థ్ గారికి మళ్ళీ ఆ స్థాయి హిట్ అవుతుంది. డైరెక్టర్ గారు ఈ సినిమాను చాలా బాగా తీసారు. ఈ సినిమాతో మళ్ళీ మన పాత సిద్దార్థ్ గారిని చూస్తాం.
దర్శకుడు కార్తిక్ జి క్రిష్ మాట్లాడుతూ….
నేను ఏ కంటెంట్ రాసిన ఈ సినిమా కంటెంట్ మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చాలామంది చెప్పారు. ఇప్పటివరకు సిద్దార్థ్ ను మీరు ఒక లవర్ బాయ్ గా చూసారు.
సిద్దార్థ్ ఒక రగ్గడ్ లవర్ బాయ్ గా ఇందులో చూపించాను.ఈ సినిమా అన్ని సినిమాలలా కాకుండా, కొంచెం కొత్తగా ఉండబోతుంది. ఈ సినిమాలో లవ్ , కామెడీ, రొమాన్స్ అన్ని ఉంటాయి. ఇది న్యూ జనరేషన్ సినిమా అని చెప్పొచ్చు.
హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ….
నన్ను చాలామంది అడుగుతుంటారు మీరు కంప్లీట్ కమర్షియల్ సినిమా చెయ్యొచ్చు కదా అని, దానికి సమాధానమే ఈ సినిమా. ఇప్పటివరకు మిమ్మల్ని ఒక లవర్ బాయ్ లా చూసారు. మిమ్మల్ని నేను కంప్లీట్ డిఫరెంట్ చూపించబోతున్నాను అని చెప్పాడు.
పూర్తి కమర్షియల్ సినిమాగా కార్తీక్ జి. క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరియర్ ను పూర్తిచేసినట్టు అవుతుంది. ఇప్పటికీ నా చేతిలో ఓ అరడజను సినిమాలు ఉండటం ఆనందాన్ని కలిగిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది. అన్నారు. తదనంతరం పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది.
Takkar film has Unique Love Story with lot of Action and Romance: Siddharth
Talented actor Siddharth, known for films like Bommarillu and Nuvvostanante Nenoddantana, is set to woo crowds in a refreshing avatar for his upcoming Tamil-Telugu action romance Takkar. Written and directed by Karthik G Krish, the film features Divyansha Kaushik as the female lead.
Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal, in collaboration with People Media Factory, Abhishek Agarwal Arts, and Passion Studios, Takkar releases in theatres on June 9 in Telugu and Tamil. After hogging the limelight for the action-packed trailer, teaser and the three songs, the team is now busy with promotions.
Today makers held a grand press meet in Hyderabad to share more details about the film. Total team attended the event and they’ve shared thier best experience. Co-producer Vivek Kuchibotla said, “This film has good content, Siddharth is a fantastic performer, and this film will be a success for Siddharth. The director has done an excellent job with this film. With this film, we will see our Vintage Siddharth again.”
“Many people said that every content I’ve written will definitely be liked by Telugu audience,” director Karthik G Krish said. You’ve only seen Siddharth as a lover boy so far.
In this film, I portrayed Siddharth as a rugged lover boy. This film will be unique and distinct from all others. This film contains love, comedy, and romance.”
Hero Siddharth said “Many people have asked me when I plan to make a full-length commercial film, and this is the answer. So far, you’ve been treated me as a lover boy. This time, I’ll show you a completely different avatar of mine. This film was directed by Karthik G. Krish as a full-fledged commercial entertainer. This love story is full of action and romance.”
“This August, I will complete his 20-year career as a hero,” he added. I’m still happy to have a half-dozen films in my possession. In this film, I learned martial arts and performed action scenes. For 35 days, action scenes were shot. Divyansha’s role in this film is quite different. This film’s unique love story will undoubtedly impress this generation.”
The team then answered several questions asked by the journalists during Q&A session.