మర్డర్ మూవీ ఫేమ్ ఘన ఆదిత్య మరియు ప్రియ జంటగా, రాజ్ లోహిత్ దర్శకత్వం లో, ఎల్లో మాంగో ఎంటర్ టైన్మెంట్ మరియు వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “తకిట తదిమి తoధాన” . ఈ రోజు హైదరాబాద్ లోని వ్యాస స్టూడియోలో పూజా కార్యక్రమాలు వైభవoగా జరిగాయి.సకినాల నరేంధర్ రెడ్డి కెమెరా ఆన్ చేయగా FTIH ఫౌండర్ & CEO కటకం ఉదయ్ కిరణ్ గారు క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చందన్ కుమార్ మాట్లాడుతూ”ఈ చిత్రం ఈ నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది .ఇదొక వెరైటీ కధ. మంచి ఎమోషన్ ఉంటుంది. అర్జున్ కెమెరా మెన్ గా , రైటర్ గా దిలీప్ కుమార్ , ఎడిటర్ గా జానీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ గా అభిషేక్ రుఫుస్ , స్టిల్స్ బన్నీ సంగరాజ్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా,పి. ఆర్. ఓ గా వీరబాబు, సాయి కిరణ్ రెడ్డి(mskr), అత్యున్నత సాంకేతిక బృందం కలిసి పని చేస్తున్నారు.