కొత్త హీరో విక్రాంత్ తన సొంత స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ..’స్పార్క్ లైఫ్’. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లీల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం థ్రిల్ గురి చేసిందో చూద్దాం పదండి.
కథ:
జై (విక్రాంత్) ఒక మెడికో, అతను ఏదో అనుమానంతో కొందరు అమ్మాయిల్ని ఫాలో అవుతూ ఉంటాడు. అయితే అతను ఫాలో అయిన అమ్మాయిలు అందరూ ఒకరకంగా సైకోలుగా ప్రవర్తించి ఆ తర్వాత సడన్గా చనిపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వీటన్నిటి వెనక జై ఉన్నాడు అన్న అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుంటారు. ఈ గొడవ జరిగే సమయంలో అనుకోకుండా.. జై లవ్ చేసే రుక్సర్ థిల్లాన్ కూడా మిగిలిన అమ్మాయిల లాగే సడన్గా చనిపోతుంది. రుక్సర్ లాగానే తన కూతురు మెహ్రీన్ కి కూడా జరుగుతుంది అని భావించిన ఆమె తండ్రి జైను, దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. ఇదే సమయానికి జై కి ఆర్య అనే మరొక పేరు ఉంది అన్న విషయం బయట పడుతుంది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? జై రెండు పేర్ల వెనక సీక్రెట్ ఏమిటి? అమ్మాయిలు అసలు ఎందుకని అలా సైకోల బిహేవ్ చేస్తున్నారు? జరుగుతున్న మరణాల వెనుక కారణం ఏమిటి? జై ఎందుకని ఇందులో ఇరుక్కున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ మూవీకి సంబంధించిన స్టోరీ మొత్తం వైజాగ్ ,హైదరాబాద్, ఢిల్లీకి చెందిన ట్రైబల్ ఏరియాలో చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ మొత్తం కథలో జరిగే ఏ ఒక్క ట్విస్ట్ మనకు అర్థం కాదు. హీరో హీరోయిన్ల చుట్టూ ఓ అద్భుతమైన లవ్ ట్రాక్ చూపిస్తుంది వెనుక హత్యలు జరగడం గురించి చూపించారు. సెకండ్ హాఫ్ మొదలయ్యాక అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది.
ఆర్మీ డాక్టర్ టెర్రరిస్టులపై చేసేటటువంటి కొన్ని ప్రయోగాల కారణంగా ఇలా అందరూ చనిపోతారు అంటూ సరికొత్త పాయింట్ ని రీవిల్ చేస్తారు. ఒకరకంగా ఈ మూవీ చూసేటప్పుడు ఇందులో జాంబిరెడ్డి ఛాయలు కనిపిస్తాయి. ఒక మనిషి మెదడుని కంట్రోల్ చేయడం ద్వారా దేశంలోని ఉగ్రవాదాన్ని మనం కంట్రోల్ లోకి తీసుకోవచ్చు అనే కొత్త పాయింట్ని ఈ మూవీ ద్వారా కన్వెజ్ చేశారు. స్టోరీ పరంగా సినిమా ఎంతో ఎక్సలెంట్ గా ఉంది. హీరోగా, డైరెక్టర్ గా రెండు పక్కల తన బాధ్యతలను విక్రాంత్ బాగా బ్యాలెన్స్ చేశాడు. అయితే మూవీ చాలా హెవీ కాన్సెప్ట్ ఉంది.
హీరో విక్రాంత్ చాలా బాగా నటించారు. దర్శకత్వ బాధ్యతలు బాగా హ్యాండిల్ చేశారు. సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. నిర్మాణ విలువలు క్వాలిటీగా ఉన్నాయి. వీకెండ్ లో చూసేయండి
రేటింగ్: 3