గతంలో న్యూస్ ఛానల్ అంటే న్యూట్రల్ గా ఉండేవి. ‘ఈనాడు’ వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా ఉన్నా ఎంతో కొంత న్యూట్రల్ గా ఉండేవి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ‘సాక్షి’ పెట్టి ఏకపక్షంగా వార్తలు వేయటం ప్రారంభించారు. ఇక అక్కడ నుంచి ఎ.బి.ఎన్ ఆంధ్ర జ్యోతి, ఈనాడు, మహాన్యూస్, టీవీ5, ఎన్టీవి లాంటివి తెలుగుదేశం పార్టీకి ఫేవరేట్ గా మారాయి. అయితే 2014 ఎన్నికల తరువాత ఎన్ టివి, తెలుగుదేశానికి యాంటీగా వార్తలు చేయటం ప్రారంభించింది. అటు తెలంగాణాలో కెసీఅర్ కు ఫేవర్ గా టీన్యూస్, యాంటిగా వీ6 చానల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక టీవీ9 గోడమీద పిల్లి వాటం ప్రదర్శిస్తూ ఎటు దొరికితే అటు వెళ్ళటం ప్రారంభించింది. ఇక జనసేనకు 99టివి, ప్రైం9, నిన్న కాక మొన్న పెట్టిన స్వతంత్ర ఇటు జనసేనకు ఫేవరేట్ గా నిలిచాయి. ఇక టీవీ9 కూడా జగన్ నామ జపం చేయటం ప్రారంభించాయి.
అయితే బార్క్ ఇచ్చే రేటింగ్స్ ప్రకారం జగన్ కు ప్రో గా ఉన్న టివి9, ఎన్ టివి, సాక్షి రేటింగ్స్ వారం వారం తగ్గటం ప్రారంభం అయింది. గతంలో టాంపరింగ్ జరుగుతున్నది అన్న కారణంగా ఒక సంవత్సరం పాటు న్యూస్ ఛానల్స్ రేటింగ్స్ ఆపి ఆ తరువాత రిలీజ్ చేసారు. ఎన్ టివి నంబర్1 లో కొనసాగుతూ వస్తున్నది. ఎక్కువగా సినిమా కంటెంట్ మీద ఆధార పడే ఎన్ టివి బ్రేకింగ్ లో అటు డిస్కషన్స్ లో మెరుగైన ప్రతిభ కనబరిచే టివి9 ని దాటి నంబర్ వన్ యేమిటా అని అందరు ముక్కు మీద వేలు వెసుకున్నారు. దూరదర్శన్ కంటేంట్ లాగా ఉండే ఈ టివి, ఎన్ టివి లు ప్రేక్షకుడి అభిరుచి మేరకు అప్డేట్ కాలేక పోయాయి. ఒక బ్రేకింగ్ న్యూస్ ని రోజంతా నడిపే టివి9ని అందరూ తిట్టుకుంటూ అయినా చూస్తున్నారు. అయితే గత కొన్ని వారాలుగా పరిశీలించినట్లైతే జగన్ భజన్ చేసే టివి9, ఎన్ టివి, సాక్షి రేటింగ్ లు తగ్గుతున్నాయి. అంటే ఇటు ఆంధ్రాలో జగన్ ప్రభ మసక బారుతున్నట్లు అవుతున్నది. అటు టివి5, మహా, ఏబిఎన్, ఈటివి లాంటి చానల్స్ చిన్నగా గ్రో అవటం చూస్తుంటే అవి నంబర్ వన్ స్థానానికి వెళ్ళేట్టుగా ఉన్నాయి. రేటింగ్ వచ్చిన కొత్తల్లో ఎన్ టివి 70 నుంచి 80 రేటింగ్ పాయింట్లు ఉండగా, టివి9 50 నుంచి 60 మధ్య ఉండేది. అటు ఎబిఎన్, టివి5, మహా న్యూస్ లాంటివి 5-10 రేటింగ్ పాయింట్స్ తో ప్రారంభించి ఇప్పుడు వారం వారం కొంచెం కొంచెం పెరుగుతూ 3 వస్థానం లో కొనసాగుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న వేళ న్యూస్ కు ప్రాధాన్యత ఇవ్వకుండా సినిమా కంటేంట్ ను నమ్ముకున్నందు వలనో లేక జగన్ జపం చేయటం వలనో ఎన్ టివి డ్రాస్టిక్ గా పడిపోతూ వస్తున్నది. యుట్యూబ్ లో జనసేన గురించి పెడితే అటు ప్రైం9, 99టివిలు లక్షల్లో వ్యూస్ రావటం చూసాం. ఇక తెలంగాణా లో కూడా టి న్యూస్ ఎన్నికలవేళ గట్టిగా పుంజుకుని హైదరాబాద్ మార్కెట్ లో 2వ స్థానంలో కొనసాగుతున్నది. ఏది ఏమైనా ఓవరాల్ గా జగన్ భజన చేస్తున్న చానల్స్ ప్రజాదరణ కోల్పోతున్నాయి అనేది వాస్తవం. వార్తను వార్తలాగా ప్రసారం చేస్తే ఈ గోల ఉండదు కదా..!