విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన విశాఖ – రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలి. సమీపంలో తెలుగుదేశం పార్టీ కేడర్ తక్షణమే ప్రమాద స్థలానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాయగడ ప్యాసింజర్ రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన, మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను.