“ఓ చిట్టీ తల్లి’’ పాటను సీనియర్ నటులు మురళి మోహన్, కలశ మూవీ టైటిల్ సాంగ్ ను దర్శకులు విర శంకర్ ఆవిష్కరించారు. చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. కొండ రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 15న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ ఫిలింఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ‘‘ఓ చిట్టీ తల్లి’’ సాంగ్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నటులు మురళీమోహన్ ఆవిష్కరించారు. కలశ టైటిల్సాంగ్ ను దర్శకులు వీర శంకర్ విడుదల చేశారు.
అనంతరం మురళీ మోహన్ గారు మాట్లాడుతూ…
ఈ చిత్ర దర్శకుడు రాంబాబు దర్శకత్వంలో నేను కొన్ని సీరియల్స్ చేశాను. మంచి పర్‌ఫెక్షనిస్ట్. దాసరి నారాయణరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్‌లకు సీన్‌లకు సంబంధించిన వివరాలు డైలాగ్‌లు చెపుతుంటే టేపు రికార్డర్‌లో రికార్డు చేసుకునేవారు. ఆ తర్వాత వాటిని నీట్ రాసుకొస్తే.. చిత్రీకరణ సమయంలో వాటిలో కొన్ని డైలాగ్‌లు కొట్టేసేవారు. ఎందుకంటే అవి ఈ సీన్‌కు అంత అవసరం లేదు అనేవారు. అలాగే ఈ రాంబాబు కూడా మంచి రచయిత. ఏది కావాలో అదే తీస్తాడు. తద్వారా నిర్మాతకు లాభం. ఈ సినిమా గురించి విన్నాను. మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్. థ్రిల్లర్ అంటే రాతకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. తీత అంటే కెమెరా వర్క్‌కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే సంగీతానికి కూడా. వీటి విషయంలో దర్శక, నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అని పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తోంది. నిర్మాత రాజేశ్వరి గారు ఈ చిత్రం పట్ల చూపించిన శ్రద్ధ ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమౌతోంది. ఈ సినిమా చక్కటి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నా. అలాగే ఇటీవల నేను ఓ చిన్న సినిమాకు సంబంధించి బెంగుళూరులో ప్రెస్‌మీట్‌కు అటెండ్ అయ్యాను. అక్కడ కేవలం రెండో, మూడో కెమెరాలు, ఓ నలుగురు జర్నలిస్ట్‌లు మాత్రమే హాజరయ్యారు. వారు కూడా కాలుమీద కాలు వేసుకుని మనం చెప్పేది రాసుకోవడం కూడా లేదు. కానీ మన తెలుగు సినీ మీడియా అలా కాదు. సినిమా చిన్నదైనా.. పెద్దదైనా దానికి మంచి ప్రమోషన్ ఇస్తారు. అందుకు ఉదాహరణగా ఇక్కడున్న ఇన్ని కెమెరాలను, ఇంతమంది జర్నలిస్ట్‌లను చూస్తుంటే తెలుస్తుంది. తెలుగు సినీ మీడియాకు నా ధన్యవాదాలు అన్నారు.
దర్శకులు వీరశంకర్ మాట్లాడుతూ…
ఈ ‘‘చిట్టితల్లి’’ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది. ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేసాంగ్. ఈ పాటే కాదు సినిమా కంటెంట్ కూడా చాలా బాగుంది. దర్శకుడు రాంబాబు ఈ లైన్ చెప్పినప్పుడు హిట్ మూవీ తీస్తున్నారు అనిపించింది. ఇలాంటి సైలకాజికల్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాలంటే కత్తిమీద సాము లాంటింది. నిర్మాత సహకారం చాలా ముఖ్యం. లక్కీగా దర్శకుడు రాంబాబుకు సినిమాల మీద మంచి ప్యాషన్ ఉన్న నిర్మాతలు చంద్రజగారు, స్వామి గారు దొరికారు. చాలా మంది కొత్తవారు సినిమా తీశామంటే తీశాం అన్నట్లుగా ఉంటారు. కానీ ఈ నిర్మాతలు మాత్రం పక్కాగా అన్నీ తెలుసుకుని ప్రొఫెషనల్‌గా ప్రొడక్షన్‌లోకి దిగారు. అందుకే ఇంత మంచి విజువల్ వండర్‌ను రూపొందించగలిగారు. తప్పకుండా ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రం అవుతుందని నేను నమ్ముతున్నాను. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
నిర్మాత రాజేశ్వరి చంద్రజ మాట్లాడుతూ…
పెద్దలు మురళీమోహన్ గారు మమ్మల్ని ఆశీర్వదించటానికి రావటం మా అదృష్టంగా భావిస్తూ.. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సినిమా ప్రారంభం నుంచి మాకు వెన్నుదన్నుగా నిలిచారు మురళి మోహన్ గారు, మా వెల్విషర్ వీరశంకర్ గారికి ధన్యవాదాలు. దర్శకులు రాంబాబుగారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్టైట్‌మెంట్ ఫీలయ్యాను. ఇప్పటి వరకూ భారతీయ వెండితెరమీద ఇలాంటి డెఫరెంట్ పాయింట్‌తో ఏ సినిమా రాలేదు అని గర్వంగా చెప్పగలను. ‘కలశ’ అనే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్‌తో కూడిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ విత్ హర్రర్ కథను ప్రేక్షకులకు సాదా సీదా టెక్నీషియన్స్‌తో చెపితే సరిపోదు అనిపించింది. అలాగే ఆర్టిస్ట్‌ల విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ మంచి టీమ్ దొరికింది. రాంబాబుగారు ఈ సినిమా కోసం నిజంగా ప్రాణం పెట్టి పనిచేశారు అని చెప్పాలి. ఇందులోని ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. ఏ పాత్ర అనవసరంగా పెట్టింది కాదు. ఖర్చు విషయంలో అసలు మీరేమీ ఆలోచించకండి అని దర్శకుడికి మిగిలిన టెక్నీషియన్స్‌కు ముందే చెప్పాను. ఆర్టిస్ట్‌గా, గాయనిగా, నర్తకిగా వివిధ రంగాలలో పేరు, ప్రఖ్యాతుల సంపాదించుకున్న నేను ప్రొడక్షన్ చేస్తున్నాను అంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వాటిని ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నా. ఓ ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా నిర్మించా. ప్రేక్షకులందరికీ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే చిత్రం అవుతుంది. ఈనెల 15న థియేటర్స్‌లో విడుదలౌతున్న మా చిత్రాన్ని ఆదరించవలసిందిగా ప్రేక్షకులను కోరుతున్నాం అన్నారు.
చిత్ర దర్శకుడు కొండా రాంబాబు మాట్లాడుతూ…
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు వచ్చిన మురళీ మోహన్, వీర శంకర్ గార్లకు నా ధన్యవాదాలు. మురళీ మోహన్ గారు దర్శకుల, నిర్మాత హీరో. కొంచెం కూడా గర్వంలేని మహామనిషి. దర్శకుడి విషయంలో చిన్న, పెద్ద, సీనియర్, జూనియర్ అనే బేధం చూపించారు. ఆయనతో పనిచేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మా నిర్మాత చంద్రజ గారు, స్వామిగార్లకు ఇది తొలి ప్రొడక్షన్ అయినా.. ఈ సబ్జెక్ట్‌కు ఇంత మంచి టెక్నీషియన్స్‌ను, ఆర్టిస్ట్‌లను ఇవ్వడమే కాకుండా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫుల్ సపోర్ట్ చేశారు. చంద్రజగారి వంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దొరకబట్టే ‘కలశ’ ఇంత అద్భుతంగా వచ్చింది. ఆమె కాకుండా మరొకరు అయితే ఈ సినిమాకు ఇంత న్యాయం జరిగి ఉండేది కాదేమో. థ్రిల్లర్ కథలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా చాలా కీలకం. ఈ విషయంలో మా సంగీత దర్శకుడు విజయ్ కురాకుల, డీఓపీ వెంకట్ గంగధారి గార్లు అద్భుతమైన పనితనం చూపించారు. సినిమా ఇంత బాగా రావటానికి కారకులైన యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ…
ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా కలశ డిఫరెంట్ జోనర్ మూవీ. ఇందులో లవ్, కామెడీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫ్యామిలీ తో వచ్చి చూడచ్చు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ…
ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో సైకాలజికల్ థ్రిల్లర్, సస్పెన్స్, రొమాన్స్ ఇలా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో ఈ నెల 15 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా ‘కలశ’ మూవీని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు
నటీ నటులు : భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్, రవివర్మ తదితరులు.
సాంకేతిక నిపుణులు :
నిర్మాత: డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి దర్శకత్వం: కొండ రాంబాబు.
సినిమాటోగ్రఫీ: వెంకట్ గంగధారి,
సంగీతం: విజయ్ కురాకుల,
ఎడిటర్: జున్కెద్ సిద్దిఖీ,
లిరిక్స్: సాగర్ నారాయణ,