విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడి ఘటనలో దర్యాప్తును మరింత లోతుగా చేయాలని కోరుతూ సీఎం జగన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఎన్ఐఏ అధికారులు కౌంటరు దాఖలు చేశారు.
విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడి ఘటనలో దర్యాప్తును మరింత లోతుగా చేయాలని కోరుతూ సీఎం జగన్ కు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఎన్ఐఏ అధికారులు కౌంటరు దాఖలు చేశారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేశామని, మరోసారి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని కౌంటర్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో అభియోగపత్రాన్ని ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేశామని, ట్రయల్ కూడా ప్రారంభమైందన్నారు. కేసులో ఒకరి స్టేట్మెంట్ తీసుకున్నామని కౌంటర్లో తెలిపారు. పిటిషన్ ను డివిజన్ బెంచ్ ముందు దాఖలు చేయాల్సి ఉండగా.. సింగిల్ బెంచ్ ముందు దాఖలు చేశారని వెల్లడించారు.