రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యభరితమైన కథలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో లక్ష్. ‘వలయం’ సినిమాతో టాలెంటెడ్ హీరో అనిపించుకున్న ఆయన.. ఇప్పుడు ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా కన్న పీ.సీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ఫినిష్ చేసి ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు.
కమర్షియల్ ఎలెమెంట్స్‌తో కూడిన ఈ ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందని చెప్పుకోవాలి. “వాడిప్పుడొక రక్తం మరిగిన పులి లాంటోడు.. గ్యాంగ్ స్టర్ కా గాడ్ ఫాదర్” అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సినిమాలో లక్ష్ క్యారెక్టర్ ఎలివేట్ చేస్తూ ఈ ట్రైలర్ చూపించారు. ఈ వీడియోలో సినిమాలోని యాక్షన్, రొమాంటిక్, ఫన్నీ ఎలిమెంట్స్ అన్నీ చూపించడంతో ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అవుతుందని అర్థమవుతోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం విశేషం.
జూన్ 24న ఈ గ్యాంగ్‌స్టర్ గంగరాజు చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ.. హీరో లక్ష్ కి మంచి భవిష్యత్తు ఉంది. పెద్ద బ్యానర్ లో సినిమా చేయడం ఎప్పుడు ఆనందమే. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. తప్పకుండా అందరికి ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. దర్శకుడు మంచి ప్రతిభావంతుడు. ఆయనతో ఎప్పటికీ పని చేయాలని కోరుకుంటున్నాను. హీరో లక్ష్ తో పనిచేయడం చాలా బాగా అనిపించింది. వరుసగా ఆయనతో రెండో సినిమా కూడా చేయబోతు ఉండటం ఆనందంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్నారు.
హీరోయిన్ వేదిక దత్త మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. తెలుగు లో ఇది నా మొదటి సినిమా. హీరో లక్ష్ తో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా లో నా పాత్ర కొత్తగా వెరైటీ గా ఉంది. ఈ సినిమా నాకు ఎంతో కీలకం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ఇషాన్ గారి చాలా థాంక్స్. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుంది. ప్రేక్షకుల ఆశీస్సులు సినిమా పై ఉంటాయని ఆశిస్తున్నాను.. అన్నారు.
దర్శకుడు ఇషాన్ సూర్య మాట్లాడుతూ.. ఈరోజు నాకు ఎంతో ప్రత్యేకం. నేను దర్శకుడిగా ఇలా ఉండటానికి కారణం హీరో లక్ష్ ఆయన కు ప్రత్యేక ధన్యవాదాలు. ఓ మంచి పెద్ద బ్యానర్ లో దర్శకుడిగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఒక మంచి సినిమా తో వస్తున్నందుకు గర్వంగా ఉంది. అందరు ప్రేమతో పనిచేశారు. అందుకే ఇంత మంచి అవుట్ ఫుట్ వచ్చింది. తప్పకుండా అందరిని ఈ సినిమా అలరిస్తుందని నమ్ముతున్నాను.
నిర్మాత చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మా బ్యానర్ లో రామారావు గారు, నాగేశ్వర రావు వంటి పెద్ద హీరోలతో సినిమాలు చేశాము. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. దాదాపు పదిహేను సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. వీటిలో గ్యాంగ్ స్టార్ గంగరాజు సినిమా ఒకటి. ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కూడా అదిరిపోతుంది. కొత్తవారు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. దర్శకుడు సినిమా ను ఎంతో బాగా హ్యాండిల్ చేశాడు. పెద్ద డైరెక్టర్ అవబోతున్నాడు. అందరు నటీనటులు చాలా బాగా చేశారు. జూన్ 24 న రాబోతున్న ఈ సినిమా పెద్ద హిట్ కాబోతుంది. తమిళ్ లో కూడా విడుదల అవుతున్న ఈ సినిమా అక్కడ మంచి హిట్ అవుతుంది అన్నారు.
హీరో లక్ష్ చదలవాడ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం మేము ఎంతో కష్టపడ్డాం. అందరి సహకారంతో ఈ చిత్రం ఇక్కడిదాకా వచ్చింది. జయసుధ గారి అబ్బాయి నిహార్ ఈ సినిమా లో నటించడం ఆనందంగా ఉంది. నటి సత్య కృష్ణ గారి కూతురు కూడా ఈ సినిమా తో పరిచయం అవుతున్నారు. ఎంతో మంది కొత్తవాళ్లు ఈ సినిమా లో నటించారు. మా టీం అందరూ ఎంతో పక్కాగా ప్లాన్ చేయడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. సంగీత దర్శకుడు సాయి కార్తీక్ గారితో వర్క్ చేయడం చాలా అదృష్టం. నేపథ్య సంగీతం చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ ఇషాన్ సూర్య గారు మంచి టాలెంటెడ్. ఈ సినిమా ను ఆయన ఎంతో బాగా హ్యాండిల్ చేశాడు. హీరోయిన్ వేదిక తో నటించడం కొత్త అనుభూతిని ఇచ్చింది. సినిమాలో అన్ని అంశాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరు ఈ సినిమా ను ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
సాంకేతిక వర్గం:
దర్శకత్వం: ఇషాన్ సూర్య
నిర్మాత: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
సినిమాటోగ్రఫీ: కణ్ణ పి.సి.
సంగీతం: సాయి కార్తీక్
ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు
ఫైట్స్: డ్రాగన్ ప్రకాశ్
కొరియోగ్రాఫర్స్: భాను, అనీష్
పి.ఆర్.ఓ: సాయి సతీశ్, పర్వతనేని రాంబాబు
Laksh’s ‘Gangster Gangaraju’ Mass-appealing Theatrical Trailer Released
Young and energetic hero Laksh is on full swing with the success of his last movie Valayam. To reach next level of stardom, the actor chose a mass and commercial subject and the movie Gangster Gangaraju directed by young and dynamic director Eeshaan Suryaah is getting ready for release. The film is produced prestigiously by well-known producer Padmavati Chadalavada under the banner of ‘Sri Tirumala Tirupati Venkateswara Films’ and presented by ‘Chadalavada Brothers’.
Meanwhile, the film’s theatrical trailer was launched on Sundat at AMB Mall in presence of the entire cast and crew. The event was a grand success and the team expressed contentment over the outcome. They wished the movie will become a huge hit. The trailer is loaded with all the commercial elements and it got instant response.
The trailer begins with a powerful dialogue, “Vadippudoka Raktham Marigina Pulilantodu… Gangsteroka Godfather…” which gives all the elevation to Laksh’s character in the movie.
Laksh sports a massy look and the character is action-packed. The character has different shades. Besides action side, the trailer also shows, romantic, emotional and funny side of the movie. The trailer is truly mass-appealing and Laksh came up with a solid performance. Charan Deep, on the other hand, looked menacing as the villain. Vedika Dutt looked glamorous, wherein Vennela Kishore too appeared in the video.
While teaser and songs generated interest on the movie, the trailer takes the expectations to another level. Director Eeshaan Suryaah presented the role in a powerful manner. Kanna PC’s camera work is praiseworthy, wherein Sai Kartheek gives raise to every scene with his background score.
Being made with a different and first of its kind storyline, ‘Gangster Gangaraju’ will have all the thrilling elements for movie buffs. The movie is scheduled for a grand release on June 24th.
Cast: Laksh Chadalavada, Vedika Dutt, Vennela Kishore, Charan Deep, Srikanth Iyenger, Goparaju Ramana, Nihar Kapoor, Rajeshwari Nair, Satyakrishan, Raviteja Nannimala, Sammeta Gandhi, Rajendra, Anu Manasa, Lavanya Reddy, Annapoorna, Etc.
Technical Crew:
Director – Eeshaan Suryaah
Producer – Chadalavada Padmavathi
Banner – Sri Tirumala Tirupati Venkateswara Films
Presenter – Chadalavada Brothers
Music – Sai Kartheek
DOP – Kanna PC
Editor – Anugoju Renuka Babu
Choreographers – Bhanu, Anish
Fights – Dragon Prakash
Pro – Sai Satish, Parvataneni Rambabu