• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

విస్సన్నపేట హైస్కూల్ పై తప్పుడు వార్తలు – రాసిన సంస్థలపై క్రిమినల్ కేసులు

admin by admin
July 28, 2023
in politics
0 0
0
విస్సన్నపేట హైస్కూల్ పై తప్పుడు వార్తలు – రాసిన సంస్థలపై క్రిమినల్ కేసులు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మనకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే అదేంటో లోకంలో అన్నీ ఘోరాలు.. ఎక్కడ చూసినా అన్యాయాలు కనిపిస్తాయి. అదే మనకు రోకున్న పార్టీ కానీ ప్రభుత్వంలో ఉంటే రాష్ట్రం మొత్తం రామరాజ్యంలా ఉంటుంది. నెలకు మూడు వర్షాలు.. ఏటా మూడు పంటలు ఇంటింటా నవ్వుల పరవళ్లు.. అసలు ఈ రాష్ట్రంలో కష్టం ఎక్కడా లేదా అని దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా కథనాలు వండుతారు.

ఇక తమకు నచ్చని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే ఇక వారికి అడ్డూ ఆపూ ఉండదు.. లోకంలో ఎక్కడ ఏది జరిగినా దాన్ని జగన్ మోహన్ రెడ్డికి ముడిపెట్టి ఇష్టానుసారం సొంత పైత్యాన్ని జోడించి కథనాలు వండుతారు. అదే జోరులో ఒక్కోసారి కావాలని వార్తలు రాసి … కాదు.. కాదు.. వార్తలు తయారు చేసి జనంలోకి వదులుతారు .. ఆ క్రమంలో నిన్న ఆంధ్రజ్యోతి, ఈనాడు సంస్థలు కావాలని ఒక సంఘటనను అక్కడికక్కడే ప్లాన్ చేసి అది నిజం అనేలా వార్తగా రూపొందించి జనంలోకి వదిలారు. పైన గొడుగు – కింద మడుగు అంటూ ఈనాడు, నమ్మండి – ఇది నిజంగా బడే అంటూ ఆంధ్రజ్యోతి ఓ సొంత కవిత్వాన్ని వదిలారు. వాళ్ళను అలా వదిలితే బాగోదు కదాని ఇప్పుడు ప్రభుత్వం ఆ సంస్థలు, వార్తలు రాసిన విలేకరుల మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తోంది. ఈమేరకు జిల్లా విద్యాశాఖాధికారి విస్సన్నపేట మండల విద్యాధికారికి ఉత్తర్వులు ఇస్తూ ఆయా వార్తా సంస్థల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.

హవ్వ.. ఎంత దారుణానికి తెగబడ్డారు ?

వాస్తవానికి విస్సన్నపేట జడ్పి హైస్కులును రూ. 66 లక్షలతో నాడు – నేడు పథకంలో ఆధునీకరించారు. కొత్త బెంచీలు, స్కూల్లో పచ్చదనం. శుభ్రమైన టాయిలెట్లు .. స్కూల్ చూస్తే ముచ్చటపడేలా ఉంది. అయితే ఆ పాఠశాలకు కొత్త భవనాలు, అదనపు వసతులు సమకూరడంతో కొన్ని పాత భవనాలు, అప్పట్లో నిర్మించి శిథిలావస్థకు చేరిన అస్బెస్టాస్ రేకుల భవనాలు వినియోగించకుండా వదిలేశారు. ఈ నాల్రోజుల వరుస వర్షాలకు ఆ రేకుల భవనాల్లోకి నీరు చేరింది. అయితే సదరు పత్రికావిలేకరులు, ఛానెల్ విలేకరి కలిసి పాఠశాల ప్రారంభానికి ముందే బడి ఆవరణలోకి వెళ్లి అక్కడ ఆడుకుంటున్న పిల్లలను ఆ శిథిలావస్థలో ఉన్న గదిలోకి తీసుకెళ్లి, బలవంతాన కూర్చోబెట్టి ఫోటోలు, వీడియోలు తీసినట్లు అధికారుల విచారణలో తేలింది. అంటే అక్కడ సమస్య ఏమీ లేకున్నా ఉన్నది లేనట్లు చిత్రీకరించి వార్తను రూపొందించి జనంలోకి వదిలారు. వాస్తవానికి భిన్నంగా, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసే దురుద్దేశంతో ప్రజల్లోకి వెళ్లిన ఆ వార్తల విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈమేరకు అక్కడ విచారణ జరిపి, ఆ తప్పుడు కథనాలకు బాధ్యులైన ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద క్రిమినల్ కేసులు బుక్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Previous Post

వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మొత్తం గందరగోళం

Next Post

లే అవుట్లలో కాదు… పెత్తందారుల కళ్లలో నీళ్లు

Next Post
లే అవుట్లలో కాదు… పెత్తందారుల కళ్లలో నీళ్లు

లే అవుట్లలో కాదు... పెత్తందారుల కళ్లలో నీళ్లు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ
movies

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

by admin
August 11, 2026
0

...

Read more
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

August 11, 2026
ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

August 6, 2026
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

August 3, 2026
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

August 1, 2026
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

July 24, 2026
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In