• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

లే అవుట్లలో కాదు… పెత్తందారుల కళ్లలో నీళ్లు

admin by admin
July 30, 2023
in politics
0 0
0
లే అవుట్లలో కాదు… పెత్తందారుల కళ్లలో నీళ్లు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అవును.. పేదలకు ఎప్పుడు.. ఎక్కడ మంచి జరిగినా ఓర్చుకోలేని నైజం.. వారికి సౌకర్యాలు.. పథకాలు అందితే తాళలేని తత్త్వం.. అన్నింటికీ మించి జగనన్న లే అవుట్లు పూర్తి అయితే రాజకీయంగా తాము అవుట్ అయిపోతామన్న భయం… చంద్రబాబును, ఆయన దత్త పుత్రుడిని వెంటాడుతోంది. అందుకే ఎక్కడ పేదలకు మేలు జరుగుతుందని భావిస్తే అక్కడ వాలిపోతాయి రాజకీయ రాబందులు .. శుభం జరిగే చోట గుడ్లగూబలు వాలితే మంచిది కాదంటారు.. అందుకే గుడ్లగూబల బదులు ఇదిగో … ఈ రాజకీయ గ్రద్దలు వాలుతున్నాయి.

వారం రోజుల పాటు వరుణ దేవుడు అపార వర్షాలు కురిపించేసాడు. ఏనాడూ చుక్క నీరు జాడలేని వాగులు సైతం పరవళ్లు తొక్కాయి. ఎండాకాలం పూర్తిగా వట్టిపోయి బావురుమన్న బావులు సైతం తల్లికట్టును దాటి నీళ్లు బయటకు తొణికిసలాడాయి. రెండు రాష్ట్రాల్లోని ఏ ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు తెగి ఊళ్లన్నీ నీళ్లపాలయ్యాయని పాలకులు కళ్ళల్లో వత్తులు వేసుకుని పరిస్థితి కనిపెట్టుకుని ఉన్నారు.

మహానగరాలు సైతం వరదపాలు

అంతెందుకు మీ చంద్రబాబు నిర్మించి ప్రపంచ పటంలో పెట్టిన హైదరాబాద్ సైతం నీళ్లపాలయింది. లోతట్టు ప్రాంతాల్లో కార్లకు బదులు బోట్లు తిరిగాయి. నీళ్లలో కొట్టుకుపోయిన ప్రజలు ఎందరో.. మూగ జీవాలు ఎన్నో.. మునిగిపోయిన వాహనాలు ఎన్నెన్నో.. ఈ పరిస్థితి పవన్ కళ్యాణ్‌కు తెలియదా? సినిమా రిలీజ్ పనులు, కలెక్షన్ల లెక్కలు వేసుకుంటూ బిజీగా ఉన్న పవన్ ఈ పరిస్థితిని చూడలేదా..? చూసేందుకు కళ్ళు లేవా ? రెండేళ్ల క్రితం అపార వర్షాలకు మద్రాస్ నగరం ఏమైంది. అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరంగా పిలిచే ఐటి సిటీ బెంగళూరులో ఏమైంది..? అందాల ఆగ్రాను యమునా చుట్టుముట్టలేదా ? భాగ్యనగరాన్ని మూసీ ముంచెత్తలేదా ? గోదావరి వరదల్లో తడిసి ముద్దవుతున్న లంకగ్రామాల పరిస్థితి కానరాదా ? మరి ఇప్పటికే రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు ఇవన్నీ రూపొంది సకల సౌకర్యాలతో తులతూగుతున్న మహానగరాలే కుండపోతకు తట్టుకోలేక నీట మునుగుతున్న తరుణంలో ఏమీ లేని సాధారణ లే అవుట్లు నీళ్లతో కాక.. ఇంకేలా ఉంటాయి.?

ఒకసారి కాలనీ రూపొందిన తరువాత ప్రజలు ఒక్కొక్కరుగా ఇల్లు కట్టుకుంటుండగా అక్కడ రోడ్లు, ఎత్తు చేయడం, విశాలంగా రోడ్లు వేయడం.. కాలువలు వేసి వాననీరు పారుదలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది . అవేమీ లేకుండా ఖాళీగా ఉన్న లే అవుట్లో లేదా ఖాళీ భూభాగంలో ఎక్కడైనా వాననీరు నిలవక తప్పదు. అంతెందుకు మీరు ముచ్చటపడి కొనుక్కున్న ఫామ్‌హౌస్ సైతం ఇప్పుడు నీరు నిండిపోయి.. గుంతలు గోతులతోనే ఉంటుంది. కాబట్టి పరిస్థితులను బట్టి మాట్లాడాలి.. యజమాని డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఎప్పుడుబడితే అప్పుడు మొరుగుతాను అంటే ఎలా ? బురద ఉన్నది జగనన్న లే అవుట్లలో కాదు.. మీ బుర్రల్లో ఉంది.. ముందు ఆ బురదని శుభ్రంగా కడుక్కోండి.

ప్రజలు సంతోషంగా ఇళ్లు కట్టుకుంటున్న వేళ.. మధ్యలో ఈ వర్షం వల్ల కాస్త అంతరాయం ఏర్పడింది. ఈ టైమ్‌లో నీ తొట్టి గ్యాంగ్ అక్కడికి వెళ్లి వెకిలిగా ఫొటోలు దిగుతూ వాళ్లని బాధపెట్టడమే తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? నీ దత్తతండ్రి పేదలకి ఇళ్లు ఇవ్వకముందే సెంటు భూమి.. స్మశానం అంటూ వెటకారంతో వారిని అవమానించాడు. ఇప్పుడు నువ్వు తయారయ్యావ్. మీరు ఇచ్చేది లేదు.. మెచ్చేది లేదు. ఏమిరా.. మీ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం? వెళ్లి సినిమాల్లో కుప్పి గంతులు వేసుకోపో!

Tags: Pawan Kalyan - Janasena Chief - AP politics -fake propaganda against Jagananna layouts
Previous Post

విస్సన్నపేట హైస్కూల్ పై తప్పుడు వార్తలు – రాసిన సంస్థలపై క్రిమినల్ కేసులు

Next Post

సొంత మరదలను లైంగికంగా వేధించిన మాజీ మంత్రి నారాయణ

Next Post
సొంత మరదలను లైంగికంగా వేధించిన మాజీ మంత్రి నారాయణ

సొంత మరదలను లైంగికంగా వేధించిన మాజీ మంత్రి నారాయణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ
movies

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న యానిమేషన్ మూవీ

by admin
August 11, 2026
0

...

Read more
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో పద్మశ్రీ మురళీమోహన్ కు ఘన సన్మానం

August 11, 2026
ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

ఘనంగా “సర్దార్ సర్వాయి పాపన్న” సినిమా పోస్టర్ లాంఛ్

August 6, 2026
ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

ఆగస్టు 7న “జి.డి.నాయుడు” గా వస్తున్న ఆర్. మాధవన్

August 6, 2026
కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

కళాంజలి: విభా యడవల్లి కూచిపూడి నాట్య ప్రయాణం

August 3, 2026
ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

August 1, 2026
ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

July 24, 2026
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In