రెండు దశాభ్దాలుగా పెండింగ్ లో ఉన్న 1998 డిఎస్పి అభ్యర్దులకు న్యాయం చేసేందుకు ఉధ్దేశించిన ఫైల్ పై ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సంతకం చేసినట్లు శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కల్పలతారెెడ్డి తెలియచేశారు.వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడారు.1998 లో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ సమయంలో దాదాపు 4,500 కు పైగా అభ్యర్దులకు అన్యాయం జరిగింది.అప్పటినుంచి ఆ అన్యాయం సరిదిద్ది తమకు న్యాయం చేయాలని బాధితులైన అభ్యర్దులు ప్రభుత్వాలను కోరుతూ వచ్చారు.అయినా వారికి న్యాయం జరగలేదు. మానవతాదృక్పధంతో వ్యవహరించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డిగారి ద్వారా సమస్యను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. శ్రీ వైయస్ జగన్ గారు శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కామాణిక్యవరప్రసాద్ గారి ద్వారా సమస్యను అధ్యయనం చేయించి ఈరోజు అప్పుడు అన్యాయం జరిగిన అభ్యర్దులందరికి న్యాయం చేసే విధంగా ఆ ఫైల్ పై సంతకం చేశారని కల్పలతా రెడ్డి వివరించారు.ఇంత ధైర్యంగా నిర్ణయం తీసుకోవడం ఒక్క వైఎస్ జగన్ కే సాధ్యం అయిందని వివరించారు.నిజానికి 2008 DSC వారికి సైతం అన్యాయం జరిగింది. ఆ అభ్యర్దులకు సైతం శ్రీ వైయస్ జగన్ గారు న్యాయం చేశారు.ఈ నేపధ్యంలోనే 1998 అభ్యర్దులకు కూడా మానవతా దృక్పధంతో శ్రీ వైయస్ జగన్ న్యాయం చేశారు.త్వరలోనే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ వస్తాయి…విధివిధానాలు రూపొందిస్తున్నారు అని కల్పలతా రెడ్డి చెప్పారు.ఇందరి జీవితాలలో వెలుగులు నింపేలా నిర్ణయం తీసుకున్న శ్రీ వైయస్ జగన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అన్నారుయ
ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తమకు ఉద్యోగాలు ఇచ్చే ఫైల్ పై సంతకం చేశారని తెలుసుకున్న 1998 డిఎస్పిలో అన్యాయానికి గురైన పలువురు అభ్యర్ధులు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. శాసనమండలి సభ్యురాలు శ్రీమతి కల్పలతారెడ్డిని కలసి తమ కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యాలయం ఎదురుగా రోడ్డుపై కుర్చీలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలియచేశారు.తామ ఉపాధ్యాయులుగా నియమితులయ్యాక శ్రీ వైయస్ జగన్ ఆశించిన మేరకు రాష్ర్టంలో పటిష్టమైన విద్యావిధానంలో భాగమై అంకితభావంతో పనిచేస్తామని తెలియచేశారు.
గతంలో 1998 లో అప్పుడు చంద్రబాబు హయాంలో తమకు ఘోరమైన అన్యాయం జరిగిందని దానిని సరిదిద్దమని చంద్రబాబును పలుమార్లు కోరినా ఏమాత్రం స్పందించకుండా కమిటి వేసి కాలయాపన చేశారన్నారు.దాంతో తమ జీవితాలు,కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు.నేడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో 23 సంవత్సరాల తర్వాత తమకు న్యాయం దక్కిందని ఆనందభాష్పాలతో మీడియాకు చెప్పారు.మోహన్ రావు,సాయిరామ్,నిరంజన్ తదితర అభ్యర్దులు మీడియాతో మాట్లాడారు.