వి పి ఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి “నాని తిక్కిశెట్టి”ని దర్శకుడిగా పరిచయం చేస్తూ… సాఫ్ట్వేర్ ఇంజనీర్ “వెలిచర్ల ప్రదీప్ రెడ్డి” తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం “ఫిమేల్”. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టైటిల్ రివేలింగ్ పోస్టర్ ను తెలంగాణ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదపడి… మగాళ్లలో మార్పు తీసుకువచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నానని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దర్శకుడు నాని తిక్కిశెట్టి, నిర్మాత వెలిచర్ల ప్రదీప్ రెడ్డి మరియు చిత్రబృందానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
శుభాంగి తంభాలే టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మహిళల పట్ల జరుగుతున్న దారుణాలపై విప్లవాత్మకమైన పరిష్కారాన్ని సూచిస్తూ రూపొందిన ఈ విభిన్న కథాచిత్రం త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్- అప్పాజీ, లిరిక్స్: గాంధీ కాకర్ల, సంగీతం: వంశీకాంత్ రేఖన, చాయాగ్రహణం: జగదీష్ కొమరి, ఎడిటింగ్: క్రాంతి, నిర్మాత: వెలిచర్ల ప్రదీప్ రెడ్డి, కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: నాని తిక్కిశెట్టి!!