• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నెక్స్ట్ చేసే సినిమాకు తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్తా- “సామజవరగమన” ఫేమ్ రెబ్బా మోనికాజాన్

admin by admin
July 23, 2023
in movies
0 0
0
నెక్స్ట్ చేసే సినిమాకు తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్తా- “సామజవరగమన” ఫేమ్ రెబ్బా మోనికాజాన్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

నెక్స్ట్ చేసే సినిమాకు తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్తా- “సామజవరగమన” ఫేమ్ రెబ్బా మోనికాజాన్

అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, రెబ్బా మోనికాజాన్ హీరోయిన్ గా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘సామజవరగమన’. జూన్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్బంగా చిత్ర హీరోయిన్ రెబ్బా మోనికాజాన్ మీడియాతో మాట్లాడుతూ

నేను మలయాళీ అయినా బెంగళూరులో పెరిగాను. అయితే నా చదువు అనంతరం కొన్ని యాడ్స్ లలో నటించిన నేను మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను. అయితే ఫారెన్సిక్ సినిమాకు మాత్రం మంచి పేరు వచ్చింది. అయితే తెలుగులో థియేటర్స్ రిలీజ్ అయిన నా మొదటి చిత్రం “సామజవరగమన”.

“Bro” సినిమా లుక్ టేస్ట్ కు వచ్చిన నేను వేరే ఫ్రెండ్ ద్వారా రాజేష్ గారిని కలవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ గురించి తెలియదు కానీ ఆ తరువాత రామ్ అబ్బరాజు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చెయ్యడం జరిగింది.”Bro” సినిమాలో చెయ్యకపోయినా “సామజవరగమన” వంటి మంచి సినిమాలో చేసినందుకు చాలా హ్యాపీ గా ఉంది.

ఈ సినిమా నాకి చాలా స్పెషల్.  శ్రీ విష్ణు గారి సినిమాతో పరిచయం కావడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సెట్ లో శ్రీ విష్ణు గారు, నా యాక్టింగ్ కు మోడిలేషన్ కు హెల్ప్ చేయడం వలన నరేష్ గారికి, శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ కు నేను మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగాను.

దర్శకుడు కూడా నా యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉండేలా నాలోని నటనను రాబట్టుకున్నాడు. సౌత్ లాంగ్వేజ్ సినిమాలలో నటించినా కూడా తెలుగులో నటించిన ఈ సినిమా నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అందుకే నేను చాలా లక్కీ అనుకుంటున్నాను. నా మొదటి సినిమాతోనే సీనియర్ ఆర్థిస్టులైన నరేష్, శ్రీ విష్ణు ఇలా అందరితో వర్క్ చేయడం చాలా సంతోషం గా ఉంది.

ఈ సినిమాలో నటించినందుకు తెలుగు ఇండస్ట్రీ లో అల్లు అర్జున్ గారే కాకుండా టెక్నిషియన్స్, డైరెక్టర్స్ ఇలా అందరూ నేను చేసిన సరయు పాత్రకు మెచ్చుకొని ట్వ్వీట్ చేసి నా ఏప్రిసియేట్ చేశారు.

దళపతి విజయ్ సినిమాలో నటించాలనే కోరిక బిగిల్ సినిమా ద్వారా తీరింది. అందులో ఏ చిన్న క్యారెక్టర్ అయినా చేయడానికి ఇష్టపడి అట్లీ గారిని కలవడంతో అయన నాకొక మంచి పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర ఇప్పటికే ఎప్పటికీ గుర్తుండి పోతుంది. కథలో ఇంపార్టెన్స్ ఉంటే తెలుగులోనైనా కూడా ఎలాంటి పాత్రలైనా చేస్తాను.

సామజవరగమన సక్సెస్ టూర్ కు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రజలు నాకు లాంగ్వేజ్ రాకపోయినా నా పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతను చూపించారు. ఇలాంటి ఆదరణ ఎక్కడా దొరకదు. అందుకే నేను తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాను.

తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. “Bro” సినిమాకు పనిచేయలేకపోయినా ఫ్యూచర్ లో పని చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను.

ఈ సినిమా తరువాత మలయాళం లో ఒక సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ తరువాత తెలుగు లో కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను. సామజవరగమన లాగే మంచి కథ కోసం ఎదురుస్తున్నాను. నెక్స్ట్ చేసే సినిమాకు తెలుగు నేర్చుకొని నేనే డబ్బింగ్ చెప్తాను అని ముగించారు.

Previous Post

సీహెచ్‌వీ సుమ‌న్ బాబు హీరోగా `గిద్దలూరు పోలీస్‌స్టేషన్‌`

Next Post

వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మొత్తం గందరగోళం

Next Post
వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మొత్తం గందరగోళం

వివేక హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మొత్తం గందరగోళం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక
movies

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

by admin
June 24, 2025
0

...

Read more
ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

June 23, 2025
‘కుబేర’ మూవీ రివ్యూ

‘కుబేర’ మూవీ రివ్యూ

June 20, 2025
ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

May 29, 2025
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

May 19, 2025
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In