• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

హీరో సుమన్ చేతుల మీదుగా ”మీలో ఒకడు” ట్రైల‌ర్ లాంచ్

admin by admin
May 30, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్‌పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ”మీలో ఒకడు”. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ ఈ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్ ఫిలించాంబ‌ర్‌లో జ‌రిగింది. ఆధ్యాత్మిక గురు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసనంద స్వామి శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ బ్యాన‌ర్‌ను లాంచ్ చేశారు. అనంత‌రం ఈ సినిమా టీజ‌ర్‌ను దర్శకనిర్మాత లయన్‌ సాయి వెంకట్, వ్యాపార‌వేత్త ఎస్వీఆర్ నాయుడు టీజ‌ర్ విడుద‌ల చేశారు. హీరో సుమన్, ఆధ్యాత్మిక గురు యాద్దనపూడి దైవాధీనం, పిట్ల మనోహర్ సినిమా ట్రైలర్ ఆవిష్కరించి చిత్ర‌యూనిట్‌ను అభినందించారు.

*ఈ సంద‌ర్భంగా సుమ‌న్ మాట్లాడుతూ..* ”మీలో ఒకడు” సినిమాలో న‌టించ‌డం సంతోషంగా ఉంది. సినిమా ఎంతో బాగా వచ్చింది. ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. కుప్పిలి శ్రీనివాస్ సినిమాను ఎక్క‌డా కంప్రమైస్ కాకుండా తీశారు. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నాను. నేను 44 సంవత్సరాల నుంచి సినిమాలు చేస్తున్నాను. నా నిర్మాతలకు అన్ని విభాగాల‌కు చెందిన‌వారికి, నా అభిమానులకు నా పాదాభివందనం.

*హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ..* సుమన్ గారు నాకు జీవితంలో మర్చిపోలేని అనుభూతులు ఇచ్చారు. నా అభిమాన హీరో సుమన్ గారు మా సినిమాలో నటించడం మాకు ఎంతో అదృష్టం. ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌లు సినిమాకు ఎంతో విలువైన‌వి. సినిమాను చాలా ఇష్టంగా చేశాను. మంచి టెక్నిషియన్స్‌తో ఈ సినిమా చేసాము. ప్రేక్షకుల దీవెనలు మా సినిమాపై ఉండాలని ఆశిస్తున్నాము అన్నారు. మా ఊరు సర్పంచ్ ఎస్వీఆర్ నాయుడు గారు లేకపోతే నేను లేను అన్నారు..

*నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ…* సినిమాలకు వెళ్లి చూసే వారిలో యూత్, మాస్ అధికంగా ఉంటారు. అలాంటి యూత్, మాస్ ఆడియ‌న్స్‌కు కనెక్ట్ అయ్యే సినిమా ”మీలో ఒకడు”. మానవీయా కోణంలో సుమన్ ఈ సినిమా చేశారు. తండ్రి పాత్ర‌లో చేశారు. అలాంటి సీనియ‌ర్ న‌టుడు న‌టించిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డం ఖాయం. ఇక‌ ఇంత మంది స్వామిజీ ఆశీస్సులు కూడా ఈ సినిమాకు ఉండ‌టం అదృష్టం.

*ద‌ర్శ‌క‌నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ…* సుమన్ గారు ఈ సినిమా చేయడం ఎంతో గొప్ప విష‌యం. దేవ‌త‌ల రూపం అంటే నాడు ఎన్టీఆర్ గుర్తొచ్చే వారు. అన్న‌మ‌య్య త‌ర్వాత వెంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే ఇప్ప‌టికి, ఎప్పటికి గుర్తుండే అన్నమయ్య పాత్ర. ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు సుమ‌న్ గారు. కుప్పిలి శ్రీనివాస్ ఎంతో క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి ”మీలో ఒకడు” సినిమా చేశాడు. ఎంతో ఎదుగుతున్నాడు. రాబోయే రెండుమూడేళ్ల‌లో మ‌రెంతో ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను.

*ఫైట్ మాస్టర్ హంగామా కృష్ణ మాట్లాడుతూ..* ఈ సినిమాలో నాకు హంగామా కృష్ణ పాత్రను కుప్పిలి శ్రీనివాస్ గారు సెట్ చేశారు. ఫైట్ మాస్ట‌ర్‌గా చేస్తూనే మెయిన్ విల‌న్ పాత్ర చేశాను. ప్ర‌తి సంద‌ర్భంలో సుమన్ గారు ఎన్నో విలువైన‌ సలహాలు ఇచ్చారు. ఆయ‌న‌కు పాదాభివంద‌నం.

న‌టీనటులు: లయన్ కుప్పిలి శ్రీనివాస్ (హీరో), హ్రితిక సింగ్ , సాధన పవన్ (హీరోయిన్స్)
రచయిత : శివప్రసాద్ ధరణికోట
పర్యవేక్షణ : కె.ప్రశాంత్
కొరియోగ్రాఫర్ : అమ్మ రాజశేఖర్
డి.ఓ.పి : పొడిపి రెడ్డి శ్రీను
మ్యూజిక్ డైరెక్టర్ : జై సూర్య
పాటలు : సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్‌ శ్రీరామ్, జై సూర్య
సింగర్స్ : సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధ‌నుంజయ్, శ్రీ కృష్ణ, దీపు
ఫైట్స్ : హంగామా కృష్ణ
ఎడిటర్ : ప్రణీత, ఎన్టీఆర్
నిర్మాణం: లయన్ కుప్పిలి వీరాచారి

కథ , ఐడియా ,స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : కుప్పిలి శ్రీనివాస్

Previous Post

కె జి ఎఫ్ రాక్ స్టార్ యశ్ నటించిన రారాజు మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన మెగా డైరెక్టర్ వి వి వినాయక్

Next Post

అన్‌స్టాపబుల్‌ చిత్రం ప్రారంభం !!!

Next Post

అన్‌స్టాపబుల్‌ చిత్రం ప్రారంభం !!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In