మెసేజ్ ఓరియెంటెడ్… కమిట్ మెంట్
టైటిల్ తోనే యూత్ ని ఆకట్టుకుంది కమిట్ మెంట్ మూవీ. తేజస్వి మదివాడ, మాగంటి శ్రీనాథ్, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్, రాజా రవీంద్ర, అభయ్ సింహా రెడ్డి, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, ప్రధాన తాాగణంతో తెరకెక్కింది. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్3 ప్రొడక్షన్స్, ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్ లో బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ ఎంర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.
కథ: కమిట్ మెంట్ సినిమా నాలుగు ఉప కథల సమాహారం. మొదటిది ఉన్నత చదువులు చదివిన ఓ నిజాయితీ గల అమ్మాయి…. సినిమాల్లో స్థిర పడతానికింలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ తాను అనుకున్నది సాధించింది…
రెండోది… ఎంతో కష్టపడి చదివి వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే అమ్మయి తన గురువులతో ఎలా అరాష్ మెంట్ కు గురయి వైద్య వత్తిలో స్థిరపడింది…
మూడోది… తన పని అవ్వగానే…. మోసం చేసిన బాయ్ ఫ్రెండ్ కి ఓ అమ్మాయి ఎలా దగ్గరైంది…
నాలుగోది… ఓ అక్రమ సంబంధం వల్ల మూడు నిండు ప్రాణాలు ఎలా నాశనం అయ్యాయి అనేది… కమిట్ మెంట్ లోని నాలుగు కథలు.
అవేంటో చూద్దాం…
నేహ (తేజశ్వి మదివాడ) బీటెక్ చదివిన అమ్మాయి. సినిమాల్లో నటించాలనే తపనతో… సినిమా ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వుంటుంది. అయితే ఆడిషన్ పేరుతో పిలిచి ప్రతి ఒక్కరూ కమిట్ మెంట్ ఇస్తేనే.. ఆఫర్ ఇస్తాం అని కండీషన్ పెడుతూ ఉంటారు. అలా క్యారక్టర్ పోగొట్టుకోవడం ఇష్టం లేని నేహ… ఎయిర్ హోస్టెస్ గా ట్రై చేస్తుంది. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఇలా ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. మరి వాటికి ఎదురొడ్డి తను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకుంది అనేది మిగతా కథ.
భారతి (తనిష్క్ రాజన్) ఎంతో కష్టపడి డాక్టర్ కోర్స్ పూర్తి చేసి… వైద్యురాలుగా స్థిరపడాలనే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. అయితే తన డీన్ (రాజా రవీంద్ర) కమిట్ మెంట్ ఇస్తే గానీ…. తనకి ICU డ్యూటీలో కానీ… ఆపరేషన్ థియేటర్ లో డ్యూటీ గానీ వేయనని వేధిస్తూ వుంటాడు. మరి ఆ వేధింపుల నుంచి భారతి ఎలా బయటపడి… మంచి వైద్యురాలిగా స్థిరపడింది అనేది మిగతా కథ.
పల్లవి(రమ్య పసుపులేటి)… తన క్లాస్ మేట్ (అభయ్ సింహా రెడ్డి) ని ప్రేమిస్తుంది. ఇద్దరూ కలిసి గోవాకి వెళ్ళి కమిట్ అవుతారు. అయితే కమిట్ మెంట్ తరువాత తనని వదిలించుకోవాలని అనుకున్న తన బాయ్ ఫ్రెండ్ తో ఎలా మింగిల్ అయిందనేదే మిగతా స్టొరీ.
నాలుగో కథ…. రాయల సీమలో ప్రారంభం అవుతుంది. జ్యోతి (సీమర్ సింగ్) అంటే రాజు (అమిత్ తివారి)కి అమితమైన ప్రేమ. అయితే జ్యోతి మాత్రం తన క్లాస్ మేట్ నాగు (సూర్య శ్రీనివాస్) ని ఇష్టపడుతుంది. ఎందుకంటే రాజు తనకంటే 15 ఏళ్లు పెద్ద అని ఆమె ఫీలింగ్. మరి ఈ ముక్కోణపు ప్రేమకి ఎలాంటి ముగింపు పలికారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు రాణించాలంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాలో ఇందులో చూపించారు. కమిట్ మెంట్ తో అమ్మాయిలను ఎలా వేధిస్తారు… నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్స్ మేనేజర్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు… ఏ వర్క్ ప్లేస్ లో నైనా అమ్మాయిలకు సెక్సువల్ అరాష్ మెంట్ ఎలా వుంటుందో… వాటిని ఎలా అధిగ మించాలో చూపించారు. ఎంతో కాస్ట్లీ చదువు అయిన డాక్టరు కోర్స్ లోనూ అమ్మాయిలకి ఎలాంటి వేధింపులు వుంటాయో చూపించి.. అలాంటి వాళ్ళకి ఎలాంటి గుణపాఠం నేర్పాలి అమ్మాయిలు అనేది ఓ చిన్న మెసేజ్ కూడా ఇచ్చాడు. చదువుకునే వయసులో వుండే ఈ తరం కుర్రాళ్ళు… అమ్మాయిలను వాడుకుని… ఎలా వదిలించుకోవానిచూస్తారు? అలాంటి వాళ్ల పట్ల ఎంత జాగ్ర్తగా వుండాలి? అనేదే ఇద్దరు టీనేజ్ లవర్స్ స్టోరీ లో చూపించారు. క్షణికావేశంలో మొహానికి లోనై… అక్రమ సంబంధంతో మూడు నిండు ప్రాణాలు ఎలా పోయాయి అనేదాన్ని రాయలసీమ నేపథ్యంలో చూపించిన విధానం సినిమాకే హైలైట్. కేవలం ఈ ఒక్క కథ… కథనంతో సినిమాను తేసుంటే… కమిట్ మెంట్ మూవీ మరోలా వుండేది. ఓవరాల్ గా ఇందులో మూడు స్టోరీలు బాగా ఆకట్టుకుంటాయి.. టీనేజర్స్ లవ్ స్టోరీ సో సో గా వుంది.
అన్వేషి జైన్ పాత్రను కూడా జిమ్ నేపథ్యంలో బాగానే తీశారు. జిమ్ కి వెళ్ళే అమ్మాయిలు … ట్రైనర్ల పట్ల ఎంత జాగ్రత్తగా వుండాలి అనేది చూపించారు. బీటెక్ చదివి నిజాయితీగా సినిమాల్లో అవకాశాలు తెచ్చుకొని రాణించాలని తపన పడే అమ్మాయిగా తేజస్వి మదివాడ ఆకట్టుకుంది. ఆమె సరసన నటించిన మాగంటి శ్రీనాథ్ పాత్ర ఒకే. వైద్య వృత్తిని అభ్యసించే అమ్మాయిగా తనిష్క్ రాజన్ మెప్పించింది. రాజా రవీంద్ర కూడా నెగిటివ్ షేడ్స్ లో మెప్పించాడు. టీనేజర్స్ గా నటించిన రమ్య పసుపులేటి, అభయ్ సింహా రెడ్డి పాత్రలు పర్వాలేదు. రాయల సీమ నేపథ్యంలో నటించిన అమిత్ తివారి పాత్ర పాజిటివ్ గా బాగుంది. అతనికి జోడీగా నటించిన సీమర్ సింగ్ పల్లెటూరి పిల్లగా మెప్పించింది. సూర్య శ్రీనివాస్ నెగిటివ్ షేడ్స్ రొమాంటిక్ పాత్రలో ఒదిగిపోయి నటించాడు.
దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్న రాసుకున్న నాలుగు ఉప కథల్లో మూడు ఆకట్టుకుంటాయి..ముఖ్యంగా మొదటిది, నాలుగోది బాగా అలరిస్తాయి. సినిమాటగ్రఫీ బాగుంది. చివరి కథకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. ఎడిటింగ్ బాగుంది. నాలుగు కథల్ని తీయడానికి నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. నిర్మాణ ఇలువలు రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా కమిట్ మెంట్ యూత్ ని అలరిస్తుంది. టీజర్లు, ట్రైలర్లలో చూపించినంత అశ్లీలత ఇందులో లేదు. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3