2018 అక్టోబర్ 17 విమానాశ్రయంలో జగన్ పై శీను కోడికత్తితో దాడి చేసిన తర్వాత బాబు వెళ్లి పరామర్శించి ఉంటే తన వయసుకు అనుభవానికి హుందాతనం ఉండేది అని కొందరి మాట ఇప్పటికీ గుర్తు. బాబు 40 ఏళ్ల రాజకీయాన్ని చూసినవారు ప్రత్యర్థులపై భౌతిక దాడులు చేయిస్తాడు అనే ఆరోపణలు సహించలేని పరిస్థితుల్లో టిడిపి శ్రేణులు. రాజకీయం సానుభూతి కోసం తనంతట తానే జగన్ దాడి చేయించుకున్నారు అంటే సహించలేని స్థితిలో వైకాపా శ్రేణులు. శ్రేణుల మధ్య దూరం పెరిగింది కలిసి పరామర్శించే పరిస్థితి లేదు.
2019 మే 23
40సం అనుభవం ఉన్న బాబుని 40+ సం వయసు ఉన్న జగన్ ఓడించటం. ఆనాడు కూడా అహం ఈగో వీడి బాబు అసెంబ్లీకి వస్తారా అనే చర్చ జరిగింది. గెలుపు ఓటములు అధికార పక్షం ప్రతిపక్షం చూసిన బాబు అహం కన్నా జనం ముఖ్యం అని స్థితప్రజ్ఞతతో అసెంబ్లీకి వచ్చారు జగన్ అఖండ విజయంతో అహంగా మార్చుకోకుండా బాబు అనుభవాన్ని సూచనలను తీసుకుంటూ “అనుభవం ఉన్నవారు తప్పు చేసినప్పుడు చెప్పండి వింటాం సలహాలు సూచనలు ఇవ్వండి ఆచరిస్తాం” అనే తరహా ధోరణిలో ఉండి ఉంటే బాబు వయసు మీదపడింది కనుక జగన్ ఏదైనా తప్పులు చేసినా పెద్దగా పట్టించుకునే స్థితిలో జనం ఉండేవారు కాదు. హోదా రైల్వే జోన్ లాంటి అంశాలు వైయస్ తరహా బాబు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూ సాధారణ పరిపాలన కొనసాగించిన ఇప్పుడు ఉన్న తరహా జగన్ పై వ్యతిరేకత ఉండేది కాదు.
మన డబ్బుతో తెలంగాణ భూభాగంలో కేసిఆర్ తో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు కట్టడానికి పూనుకున్న సమయంలో అసెంబ్లీలో “ఈరోజు నువ్వు నేను ఉండొచ్చు అక్కడ కేసీఆర్ లేదా మరొకరు ఉండొచ్చు వ్యక్తులు శాశ్వతం కాదు భవిష్యత్తులో విభేదాలు వస్తే జనం ఇబ్బంది పడతారు వయసులో చిన్నవాడివైనా దండం పెట్టి మరీ చెబుతున్నాను ఆ ప్రాజెక్టుపై ముందడుగు వేయొద్దు” అని బాబు చెప్పారు. విద్యుత్ పిపిఏలపై అనవసరపు రాద్ధాంతం. ఆ అంశంలో కూడా బాబు వివరంగా చెప్పారు. వినలేదు.
అప్పటిదాకా ప్రజావేదిక కూల్చివేత సహా కొన్ని అంశాల్లో కొంచెం అటు ఇటుగా నేను స్పందించినా ఆ రోజు జగన్ పై గౌరవం పూర్తిగా పోయింది. బాబు మాట వినకపోగా హేళనలు అవమానాలు కేవలం బాబు కోసమే బాబు పై పగ కోసమే బాబు ముద్ర చెరిపేయడం కోసమే అన్నట్టు జగన్ పాలన చేశారు.
బాబు తనపై కేసులు పెట్టినప్పుడు తనపై కేసులు పెట్టకూడదా అవినీతి వెలికితీయకూడదా అనే ధోరణిలో జగన్ చర్యలు సమర్థించవచ్చు దానికి ఓ పద్ధతి ఉంది. రూల్ ఆఫ్ లా ఉంది. అదీ వదిలేసి ఇష్టారీతిన కేసులు పెట్టి న్యాయస్థానంలో అభాసుపాలు అయ్యి తన ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు జగన్.
అన్న క్యాంటీన్లు రద్దు ఇసుక రద్దు రాజధాని పోలవరం సహా పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులు రద్దులతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం చేశారు జగన్. పైగా మూడు రాజధానులు అంటూ జనం మధ్య విద్వేషాలతో జగన్ అంటే వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరింది. వచ్చిన అవకాశాన్ని చేజేతులా బాబు పై పగతో అటు తనకి రాష్ట్రానికి నష్టం చేయడం సహించలేని స్థితి.
2023 డిసెంబర్ 3
తెలంగాణ వంతు. అనుభవ కేసీఆర్ పై ఆవేశ రేవంత్ రెడ్డి గెలుపు. ఉద్యమం సమయంలో పదేళ్ళ పాటు వెనకుండి నడిచిన & పదేళ్ళు అధికారం కట్టబెట్టిన జనం అభిప్రాయం గౌరవించకుండా కనీసం కృతజ్ఞత చెప్పి రాజీనామా చేయకపోవడం గెలిచిన పార్టీకి ఎన్నుకున్న ముఖ్యమంత్రికి మనసులో ఎలా ఉన్నా అభినందనలు తెలుపకపోవడం సమర్థనీయం కాదు.
రేవంత్ రెడ్డి ఆరంభంలో దూకుడు. సమీక్ష అంటూ విద్యుత్ వ్యవస్థ లో అవినీతి వైపు. అవినీతి వెలికితీత తప్పు కాదు. సమీక్ష చేశాక అవినీతి తేలాక చర్యలు తప్పవు. అయితే అవి కక్షసాధింపు తరహా కాకూడదు (రూల్ ఆఫ్ లా పాటించాలి లేకపోతే జగన్ తరహా అభాసుపాలు అవుతారు) ఈ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో కేసిఆర్ ఆసుపత్రిలో చేరిక మాస్టర్ స్ట్రోక్. ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి అని సంబోధించడానికి అసెంబ్లీకి రావడానికి ఇష్టపడని కేసిఆర్ ఆసుపత్రిలో ఉండగా పరామర్శించడం రేవంత్ రెడ్డి ప్రతిచర్య. ఈ అంశం పై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు.
ఇక్కడ బాబు అక్కడ కెసిఆర్ ఇద్దరూ అభివృద్ధి సంక్షేమం అంశాల్లో తక్కువై కాదు జనం మార్పు కోరుకున్నారు అనేది ప్రథమ అంశం. జగన్ మోహన్ రెడ్డి తరహా రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడకుండా తనపై జనం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తొరని కేసిఆర్ కన్నా మిన్నగా పాలిస్తారు ఆశించి ఓట్లేశారు. అలా కాని పక్షంలో జగన్ తరహా రేవంత్ కూడా ..తెలంగాణ కూడా ఆంధ్ర తరహా!
జనం విజయాన్ని కట్టబెట్టేది జనం మెచ్చినట్లు పాలిస్తారు అని కానీ తమకు నచ్చినట్లు పాలిస్తారు అనో వ్యక్తిగత కక్షలు పగలు తీర్చుకోవడానికి అనో కాదు.