• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ప్రజలు మనల్ని విశ్వసించారు.. అందరిపై బాధ్యత ఉంది: సీఎం చంద్రబాబు

admin by admin
October 18, 2024
in politics
0 0
0
స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ గురించి ప్రధానికి వివరించా: చంద్రబాబు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అమరావతి : గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని వైకాపా సర్వనాశనం చేసిందని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు విమర్శించారు. ఆ పార్టీ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. తనను జైల్లో పెడితే పవన్‌కల్యాణ్‌ వచ్చి పరామర్శించి.. తెదేపాతో కలిసి పోటీ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారని గుర్తుచేశారు. మోదీ నుంచి అందరూ నేర్చుకోవాలని.. పట్టుదల, కృషి వల్లే ఆయన మూడోసారి ప్రధాని అయ్యారని కొనియాడారు. వైకాపా చేయని తప్పులు లేవని.. అందుకే ప్రజలు చిత్తుగా ఓడించారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమికి 93 శాతం స్ట్రయిక్‌రేట్‌ ఇచ్చారన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

అండగా ఉన్న వర్గాలకు ప్రాధాన్యం కల్పించాం : ‘‘దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పార్టీ తెదేపా. భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది సమీక్షించాలి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఎన్నికల సీట్ల కేటాయింపులో తెదేపాకు అండగా ఉన్నవర్గాలకు ప్రాధాన్యం కల్పించాం. ఇంతవరకు ప్రాతినిధ్యం దక్కని వారికి అవకాశం కల్పించాం. ‘ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలి’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాం.

రాజకీయ పార్టీ.. కుటుంబం లాంటిదే : గెలిచాం మన పని అయిపోయిందని అనుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితుల వల్ల పార్టీని నమ్ముకున్న కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయాం. న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చాం. ప్రజలు మనల్ని విశ్వసించారు.. దాని ప్రకారం ముందుకెళ్లాలి. ఇప్పుడు అందరిపై బాధ్యత ఉంది. కొత్త ఎమ్మెల్యేలు 65 మంది ఉన్నారు. 18 మంది కొత్త మంత్రులు ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల్లో దాదాపు 80 మంది వరకు కొత్తవారే. కుటుంబంలోనే భేదాభిప్రాయాలు ఉంటాయి. ఫ్యామిలీని ఐక్యంగా ఉంచేందుకు ఇంటిపెద్ద ఆలోచిస్తుంటారు. రాజకీయ పార్టీ కూడా అంతే. నాపై ఆ బాధ్యత ఉంది. అధికారంలోకి రాగానే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. రాష్ట్రంలో ఏ అరాచకం చూసినా దాని వెనుక గంజాయి బ్యాచ్‌ ఉంటుంది. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వచ్చింది కనుక నిలదొక్కుకుంటున్నాం. 16,437 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ ఇచ్చాం. వచ్చే ఫిర్యాదుల్లో 70 శాతం భూ ఆక్రమణలపైనే ఉన్నాయి. అందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేశాం. ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు. ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ముఖ్యం. వరదలు వస్తే ఎలా పనిచేశామో చూశాం. యుద్ధప్రాతిపదికన పనులు చేశాం.. అందరినీ ఆదుకున్నాం.

ప్రధాని మోదీ నుంచి నేర్చుకోవాలి : చండీగఢ్‌లో హరియాణా సీఎం ప్రమాణస్వీకారం తర్వాత ఎన్డీయే సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ 5 గంటల పాటు అక్కడ కూర్చున్నారు. మోదీ అంతసేపు ఉండాల్సిన అవసరం లేదు. కానీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మోదీ నుంచి నేర్చుకోవాలి. ఆయన పట్టుదల, కృషి వల్లే మూడోసారి ప్రధాని అయ్యారు. ఆరుసార్లు గుజరాత్‌లో భాజపా గెలిచింది. మూడోసారి హరియాణాలో విజయం సాధించారు. సమష్టిగా పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందారు. ఏం చేసినా ప్రజలను దృష్టిలో ఉంచుకుని చేశారు. దేశంలో ఎవరికీ దక్కని విజయం మోదీకి దక్కిందంటే దాని వెనుక కఠోరమైన శ్రమ, క్రమశిక్షణ ఉన్నాయి. ఎక్కడా తప్పు చేయకుండా పార్టీని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారు’’అని చంద్రబాబు కొనియాడారు.

Previous Post

బాబు పాలనలో దోచుకో, పంచుకో తినుకో మాత్రమే ఉంది: వైఎస్‌ జగన్‌

Next Post

విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Next Post
విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘రైడ్’ నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్

విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్' నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In