• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

తెలుగులో గ్యాప్ తీసుకోలేదు…వచ్చిందంతే! – హీరో వైభవ్!

admin by admin
December 11, 2023
in movies
0 0
0
తెలుగులో గ్యాప్ తీసుకోలేదు…వచ్చిందంతే! – హీరో వైభవ్!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

యువ కథానాయకుడు, సీనియర్ దర్శకుడు కోదండ రామిరెడ్డి తనయుడు వైభవ నటించిన తాజా సినిమా ‘ఆలంబన’. ఆయన సరసన పార్వతి నాయర్ కథానాయికగా నటించారు. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. పారి కె విజయ్ దర్శకత్వం వహించారు. కోటపాడి జె రాజేష్ సమర్పణలో కేజేఆర్ స్టూడియోస్, కౌస్తుభ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది. డిసెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగు ట్రైలర్ విడుదల చేశారు.

హీరో వైభవ్ మాట్లాడుతూ… ”నాకు చాలా పెద్ద సినిమా ఇది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. తెలుగులో మహేశ్వర్ రెడ్డి గారు విడుదల చేస్తున్నారు.ఇప్పుడు ఓటీటీ సినిమా, థియేటర్ సినిమా అని అందరూ మనకు చెబుతున్నారు. ఇది థియేటర్ సినిమా. థియేటర్లో చూస్తేనే ఆ విజువల్ బ్యూటీ & గ్రాండియర్ ఉంటుంది. ఆ కామెడీని థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారు. డబ్బింగ్ వెర్షన్ చూశా. చాలా బాగా వచ్చింది. తెలుగులో గ్యాప్ తీసుకోలేదు. అప్పుడప్పుడూ తెలుగు నుంచి మంచి క్యారెక్టర్లు వచ్చాయి. కానీ, మిస్ అయ్యింది. గ్యాప్ వచ్చిందంతే! ఈ సినిమాకు వస్తే… మంచి ఫన్ ఫిల్మ్. పీటర్ మాస్టర్ రెండు బ్రహ్మాండమైన ఫైట్స్ చేశారు. హిప్ హాప్ తమిళ మ్యూజిక్ బావుంటుంది. మంచి సాంగ్స్ ఇచ్చారు. సినిమా మొదలైన 15 నిమిషాల తర్వాత జీనీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత నుంచి చివరి వరకు ఉంటుంది. జీనీగా నటించిన మునిష్ కాంత్, హీరోయిన్ పార్వతి… అందరితో యాక్ట్ చేయడం ఎంజాయ్ చేశా” అని అన్నారు.

దర్శకుడు పారి కె విజయ్ మాట్లాడుతూ… ”నా తొలి చిత్రమిది. తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదల అవుతుండటం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఎంత మంది దర్శకులకు వస్తుందో తెలియదు. మా నిర్మాత రాజేష్ గారికి కథ చెప్పా. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని చెప్పారు. పీటర్ హెయిన్స్ గారు మంచి వర్క్ చేశారు. ఫైట్స్ కంటే ఈ సినిమాలో డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. ఆయన బాగా చేశారు. హిప్ హాప్ ఆది గారు యాక్టింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేసిన సమయంలో మేం ఈ కథతో ఆయన దగ్గరకు వెళ్ళాం. అప్పుడు హీరోగా నటించే సినిమాలకు తప్ప వేరే సినిమాలకు మ్యూజిక్ చేయాలని అనుకోవడం లేదు. కొన్ని నెలలు ఆయన వెంటపడ్డాం. కథ నచ్చి చేయడానికి ఓకే చెప్పారు. మురళీ శర్మ గారు సైతం తమిళంలో చేస్తారో లేదో అనుకున్నాం. కానీ, కథ నచ్చి ఆయన కూడా చేశారు. జీనీ ఉందని ఇది చిన్న పిల్లల సినిమా అనుకోవద్దు. పెద్దలు కూడా చూసే సినిమా. యూనివర్సల్ కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమా. ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. దాన్ని బట్టి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంత ప్రేమ అనేది అర్థం అవుతుంది. క్రిస్మస్ సెలవుల్లో వస్తున్న ఈ సినిమాను అందరు ఆదరిస్తారని ఆశిస్తున్నా” అని అన్నారు.

పార్వతి నాయర్ మాట్లాడుతూ… ”తెలుగు నుంచి ఇంతకు ముందు కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, చేయడం కుదరలేదు. అది మా బ్యాడ్ లక్. నేను నటించిన సినిమా తెలుగులో విడుదల కావడం సంతోషంగా ఉంది. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. నాకు ఫాంటసీ సినిమాలు అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో క్యారెక్టర్ బాగా నచ్చింది. ప్రేక్షకులు అందరికీ సినిమా కూడా నచ్చుతుంది” అని అన్నారు.

గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… ”శివ కార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’ తర్వాత తెలుగులో మేం విడుదల చేస్తున్న చిత్రం ఇది. ‘ఆలంబన’ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్. ప్రేక్షకులందరినీ నవ్విస్తుంది. వైభవ్ చాలా బాగా నటించారు.‌ కామెడీతో పాటు ఫైట్స్ కూడా బాగా చేశారు” అని అన్నారు.

Previous Post

జగన్ మోహన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి

Next Post

లయన్ కిరణ్ కె పార్టీ ఇంద్రలోక్ స్టైల్‌లో ఫ్యాషన్ షోలో సినీతారల సందడి

Next Post
లయన్ కిరణ్ కె పార్టీ ఇంద్రలోక్ స్టైల్‌లో ఫ్యాషన్ షోలో సినీతారల సందడి

లయన్ కిరణ్ కె పార్టీ ఇంద్రలోక్ స్టైల్‌లో ఫ్యాషన్ షోలో సినీతారల సందడి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల
movies

గేయ రచయిత చంద్రబోస్ చేతుల మీదుగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ థియేట్రికల్ వెర్షన్ పాట విడుదల

by admin
August 24, 2026
0

...

Read more
“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

“జయహో జనార్ధన”సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేసిన దర్శకుడు బుచ్చిబాబు

August 23, 2026
ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

August 19, 2026
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In