మైథలాజికల్ మిస్ట్రీ థ్రిల్లర్ “మాయోన్” ప్రి రిలీజ్ ఈవెంట్
“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్” ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సందర్బంగా చిత్ర ప్రి రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన రైటర్ విజయేంద్ర ప్రసాద్, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, హ్యుమన్ రైట్స్ సభ్యురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు.
రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. నేను రాసుకున్న బాహుబలి కథకు కట్టప్ప గా సత్యారాజ్ నటించడంతో సత్య రాజ్ కు నాకు ఎదో ఋణాను బంధం ఉంది.మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కే”మయోన్” చిత్రం ద్వారా హీరోగా పరిచయ మవుతున్న సిబి చాలా చాక్కగా నటించాడు. దర్శక, నిర్మాతలు ఈ సినిమా కొరకు ఎంతో కష్టపడినా ఇష్టపడి చేశారు.అందుకే సినిమా బాగా వచ్చింది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
చిత్ర దర్శకుడు కిషోర్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అలాగే ఈ రోజు లెజెండరీ రచయిత విజేంద్ర ప్రసాద్ గారితో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం గా ఉంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా విజువల్స్ ఎక్స్ పీరియన్స్ అద్భుతంగా ఉంటుంది. ఓటిటి లో రిలీజ్ చెయ్యమని ఆఫర్ వచ్చినా కాదనకుండా ఆ విజువల్స్ ఎక్స్ పీరియన్స్ ను థియేటర్స్ లలో ఫుల్ స్క్రీన్ పై చూస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నిర్మాతలు థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నారు, ఇలాంటి మంచి కథ ఉన్న సినిమా ప్రేక్షకులకు అందరికీ రీచ్ అవ్వాలని నిర్మాతలు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. శిబిరాజ్ ఈ కథ వినగానే గానే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిత్రాలలో నటించే అవకాశం అరుదుగా వస్తుందని నటించడానికి ముందుకు వచ్చాడు .ఇందులో నటించిన వారందరూ చాలా డెడికేటెడ్ గా నటించారు. ఇళయరాజా గారితో వర్క్ చేయడం మా అదృష్టం. డి. ఓ. పి గారు ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు. ఈ సినిమాను తెలుగు రాష్ట్రల్లో మూవీ మాక్స్ శ్రీనివాస్ గారు రిలీజ్ చేస్తున్నారు.ఈ చిత్రాన్ని బ్లయిండ్ మెన్స్ కూడా చూడచ్చు ఈ సినిమా ట్రైలర్ ను కూడా బ్లయిండ్ మెన్స్ రిలీజ్ చెశాడు. ఇలాంటి మంచి మూవీ లో వర్క్ చేసినదుకు లక్కీ గా ఫీల్ అవుతున్నాను అన్నారు.
హీరో శిబి సత్యారాజ్ మాట్లాడుతూ..ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ధన్యవాదములు. నాకు విజేంద్ర ప్రసాద్ గారంటే ఎంతో ఇష్టం. మొదటి సారిగా తెలుగులో నేను నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ “మయోన్”. ఇందులో నేను ఆర్కియాలజిస్ట్ గా నటిస్తున్నాను. ఈ నెల 7 న ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ఈ చిత్రాన్ని నన్ను ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.మయోన్ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు
నటుడు సత్యరాజ్ మాట్లాడుతూ.. నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులు ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్లే మంచి కంటెంట్ ఉన్న “మయోన్” చిత్రం ద్వారా పరిచయమవుతున్న నా కొడుకు శిభి సత్యారాజ్ ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిర్మాతలు చాలా ఇష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ నెల 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
నిర్మాత శ్రీనివాస్..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వచ్చిన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్, నటుడు సత్య ప్రకాష్, నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, హ్యుమన్ రైట్స్ సభ్యురాలు రేణుక,తో పాటు వచ్చిన పెద్దలందిరికి ధన్యవాదాలు. పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ “మాయోన్” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గాడ్ వెర్సస్ సైన్స్ మెయిన్ థీమ్‌గా మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘U’ సర్టిఫికేట్ మంజూరు చేసిన ఈ చిత్రం గురించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు ట్విట్టర్ లో ట్వ్వీట్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది. మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుండి మంచి స్పందన లభిస్తుంది. ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందు కు చాలా సంతోషంగా ఉంది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ రోజు నుండి ఈ సినిమాకు సంబందించిన రథ యాత్ర ను ప్రారంబిస్తున్నాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ను కవర్ చేస్తూ చివరకు తిరుపతిలో దేవుని దగ్గర ఈ రథయాత్రను ముగిస్తున్నాము . హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రానికి ఫోటోగ్రాఫీ స్పెష్ ఎస్సెట్ గా నిలుస్తుంది.ప్రముఖ కెమెరామ్యాన్ రాంప్రసాద్ “మాయోన్” చిత్రాన్ని సెల్యూలాయిడ్ వండర్ గా మలిచారు.ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్ గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 7 న తెలుగు రాష్ట్రాలలోని ధియేటర్లలో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. నటుడుగా సత్యారాజ్ గారు ఇక బ్రాండ్ ను క్రెయేట్ చేసుకున్నాడు. దాని వెనుక అయన కష్టం ఎంతో ఉంది. యావత్తు భారత దేశం తెలుగు సినిమా వైపు చూసేలా కట్టప్ప పాత్రలో నటించి మెప్పించారు. ఇప్పుడు తన కొడుకు శిబి సత్యారాజ్ చేస్తున్న సినిమా కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకుముందు వచ్చిన మైథలాజికల్ సినిమాలు అన్నీ హిట్ అయ్యాయి.ఇలాంటి కథతో హిట్ అయిన కార్తికేయ సీక్వెల్ గా కూడా రాబోతుంది.శిబిరాజ్ కూడా మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ తండ్రి అంత రేంజ్ కు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దర్శక, నిర్మాతలు ఈ కథపై ఎంతో వర్క్ చేసి కష్టపడి సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఇళయరాజా గారు మ్యూజిక్ చేయడం విశేషం.అలాగే ఇలాంటి హిస్టారికల్ సినిమాలను సపోర్ట్ చేస్తూ అఖండ డి. ఓ. పి రాం ప్రసాద్ సపోర్ట్ చేస్తూ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నాడు. నిర్మాత మామిడాల శ్రీనివాస్ చాలా పద్దతిగా వెళ్లే మనిషి. మూవీ మాక్స్ ద్వారా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తూ చిన్న సినిమాలను సపోర్ట్ గా నిలబడతాడు. అలాంటి తను నిర్మాతగా మంచి కంటెంట్ ఉన్న సినిమాను సెలెక్ట్ చేసుకొని ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ ఈ నెల 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాదించాలి అన్నారు.
నటీ నటులు
సిబిరాజ్, తాన్య రవిచంద్రన్,రాధా రవి, KS రవికుమార్, SA చంద్రశేఖర్, భగవతి పెరుమాళ్ (బక్స్), హరీష్ పెరడి, అరాష్ షా తదితరులు
సాంకేతిక నిపుణులు
దర్శకత్వం : కిషోర్ ఎన్
నిర్మాత : మామిడాల శ్రీనివాస్,అరుణ్ మోజి మాణికం
మ్యూజిక్ : మాస్ట్రో ఇళయరాజా
డి. ఓ. పి : రాంప్రసాద్
పి. ఆర్. ఓ : మధు వి. ఆర్