శబరిమలలోని అయ్యప్ప దేవాలయాన్ని ఈ నెల 17 నుంచి తెరవనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది . ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంటుందని పేర్కొంది . కరోనా నేపథ్యంలో రోజుకు 15 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది . దర్శనం కోసం భక్తులు ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించింది . అటు , కేరళలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం గమనార్హం .