• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మదర్ నేచర్ ను కాపాడాలనే ‘సింబా’

admin by admin
August 9, 2024
in movies, reviews
0 0
0
మదర్ నేచర్ ను కాపాడాలనే ‘సింబా’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హాట్ బ్యూటీగా నిత్యం సోషియల్ మీడియాలో వుండే నటి అనసూయ పాత్రలు ఇటీవల చాలా వైవిధ్యంగా ఉంటున్నాయి. రంగస్థలంలో రంగమ్మత్తగా పల్లెటూరి పాత్రలో కనిపించినా… పుష్ఫలో దాక్షాయణిగా రూద్రంగా కనిపించినా… ఇటీవల విడులైన విమానం సినిమాలో వేశ్య పాత్ర పోషించినా… అన్నీ పాత్రలూ యూనిక్ గా వున్నాయి. అలాగే రజాకార్ చిత్రంలోనూ నిజాం నవాబ్ దాష్టికాలను ఎదిరించే పాత్రలో కనిపించారు. తాజాగా ‘సింబా’లోనూ ఆమె ఓ స్కూల్ టీచర్ గా… మరోవైపు సెల్యూలర్ మెమోరీస్ తో ప్రత్యర్థులను మట్టికరిపించే ఓ డేరింగ్ విమెన్ పాత్రలో నటించారు. ఈమెకు తోడు యువనటుడు మాంగటి శ్రీనాత్, సీనియర్ నటుడు, టైటిల్ పాత్రధారి జగపతిబాబు నటించారు. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద సంపత్ నంది, దాసరి రాజేందర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈచిత్రానికి కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సైఫై(సైంటిఫిక్) థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో రివ్యూలో చూద్దాం పదండి.

కథ: ఓ ప్రైవేటు స్కూల్లో పనిచేసే స్యూల్ టీచర్ అక్షిక(అనసూయ)… లోకి అనే పాత్రధారిని కిరాతకంగా చంపేస్తుంది. అయితే ఆమె అలా ఎందుకు చంపిందనే దానికి కారణాలను పోలీసులు తెలుసుకునే లోపే ధరణి అలియాస్ సుబ్రమణ్యం అనే అతనిని అక్షిక… ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేసే ఫాజిల్(మాగంటి శ్రీనాత్) ఇద్దరూ కలిసి ఓ మాల్ లో భయంకరంగా చంపేయడం పోలీసులకు సవాల్ గా మారుతుంది. ఆ కేసును ఏసీపీ అనురాగ్(వశిష్ఠ సింహా) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించి.. వీరిద్దరినీ కటకటాలపాలు చేస్తాడు. అయితే వీరిద్దరూ చంపిన వ్యక్తులు… బాగా పేరు మోసిన ఇండస్ట్రియలిస్ట్.. పార్థ(దుల్హన్ కబీర్ సింగ్)కు అనుచరులు. దాంతో వీరిద్దరినీ ఎలాగైనా చంపాలని అవినీతి పోలీసు అధికారులను ఆశ్రయించి… ఈ కేసు నుంచి ఏసీపీ అనురాగ్ ను తప్పిస్తారు. అనకున్నట్టుగానే అక్షిక, ఫాజిల్ ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో మట్టుబెట్టాలని పార్థ తమ్ముడు తీర్థ(ప్రదీప్) స్కెచ్ వేస్తాడు. ఈ క్రమంలో తీర్థను కూడా వీరిద్దరు కిరాతకంగా పోలీసులు చూస్తుండగానే చంపేస్తారు. ఈ ఎపిసోడ్ లో అదనంగా వీరికి డాక్టర్ ఇరాన్(అనీష్ కురువిల్లా)తోడవుతాడు. ఇలా ముగ్గురు కలిసి పార్థ తమ్ముడు తీర్థను అంత భయంకరంగా చంపడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలా ఎందుకు వీళ్లు ఇండస్ట్రియలిస్ట్ పార్థ మనుషులను టార్గెట్ చేసి చంపారు? దీని వెనుక వున్న కారణాలేంటి? దానికి స్కూల్ టీచర్ అక్షిక, జర్నలిస్ట్ ఫాజిల్, డాక్టర్ ఇరాన్ కు ఉన్న ఆ బయెలాజిలక్ కనెక్షన్ ఎంటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ: కాన్సెప్ట్ స్టోరీస్ చాలా సీరియస్ గానే ఉంటాయి. వాటిని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో తెరపై ఆవిష్కరిస్తే… ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అందులోనూ థ్రిల్లింగ్ అంశాలుంటే… మరింత ఎంగేజింగ్ గా ఉంటుంది. దాంతో ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాని ఆడియన్స్ ఫీల్ తో చూస్తారు. అలాగే రివేంజ్ డ్రామాకి తోడుగా ఓ మెసేజ్ ని జోడించి తీసిన ఈ సినిమా… సాధారణ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుంది. కొంచెం పాత్రధారుల ప్రవర్థించే తీరును కొన్ని కేస్ స్టడీస్ ను బేస్ చేసుకుని తెరమీదకెక్కించిన తీరు కూడా కన్వెన్సింగ్ గా ఉంది. దానికి కొన్ని దశాబ్దాల క్రితమే సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన సెల్యులర్ మెమరీ, బయోలజికల్ మెమరీస్ అనే సైకలాజికల్ పదాలను జోడించి… సినిమాలో చెప్పిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. దానికి తోడు మదర్ నేచర్ ను కాపాడుకోవాలి… ఎన్విరాన్ మెంట్ కు ఎగినెస్ట్ గా వెళితే ప్రకృతిలో జరిగే విధ్వంసం మానవాళి జీవన విధానాన్ని ఎలా విధ్వంసం చేస్తుందనే దాన్ని ఓ బస్ యాక్సిడెంట్ ద్వారా చాలా రియల్ స్టిక్ గా చూపించారు. నిబంధనలకు విరుద్దంగా అనేక పరిశ్రమలు వెలువరించే కాలుష్య ఉద్గారాలు మానవ సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తాయే ఇందులో చూపించారు. అలాగే చెట్లు నరకడం వల్ల… ప్రజలకు జరిగే నష్టాన్ని ఇందులో ప్రతి మనిషికి రోజుకు ఎంత ఆక్సిజన్ కావాలి, అందుకు ఒక వ్యక్తికి ఎన్ని చెట్లు అవసరం అవుతాయి… మన దేశంలో ఎన్ని చెట్లు ఉన్నాయి… కెనడాలాంటి దేశంలో ఎన్ని చెట్లు ఉన్నాయనేదాన్ని గణాంకాలతో సహా పర్యావరణ ప్రేమికుడిగా పురుషోత్తం రెడ్డి పాత్రను వేసిన జగపతిబాబుతో చెప్పించడం వల్ల అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
ఇంటర్వెల్ దాకా అక్ష, ఫాజిల్ బయోలాజికల్ మెమోరీస్ తో ప్రవర్తించే తీరును చూపించి… ఇంటర్వెల్ బ్యాంగ్ లో మరో పాత్రని డాక్టర్ ఇరాన్ రూపంలో వీరికి తోడుగా చూపించడంతో సెకెండాఫ్ పై మరింత అంచనాలు పెంచేశారు దర్శకుడు. వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారనే దాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపుతారు. అనుకున్నట్టే సెకెండాఫ్ లో వారి పాత్రల తీరుకు ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఓ మెసేజ్ ఓరియంటెడ్ రూపంలో చూపించి… ప్రతి ఒక్కరూ ప్రకృతి పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరించాలనే దాన్ని చూపించారు. చెట్లను నరికివేత నిశిద్ధం, భావి తరాలకోసం మొక్కలు నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం తదితర అంశాలను రేపటి తరంకోసమని చెప్పే తీరు బాగుంది. స్లో పాయిజన్ లాంటి మిథైల్ మెర్క్యూరీ, బయోలాజికల్ మెమోరీస్, సెల్యూలర్ మెమోరీస్ లాంటి సైంటిఫిక్ పదాలను వాడి… ప్రేక్షకులను ఓ కొత్త కథను చూసిన విధంగా మెప్పించారు దర్శకుడు.

హాట్ బ్యూటీ అనసూయ ప్రతి సినిమాకి ఏదో కొత్తదనం వుండేలా తన పాత్రను ఎంచుకుని నటిస్తోంది. ఇది ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఇటీవల ఆమె నటించిన చిత్రాలన్నీ డిఫరెంట్ గానే ఉంటున్నాయి. ఇందులో కూడా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నటించారు. అదే సమయంలో మాస్ ను మెప్పించే యాక్షన్ సీన్స్ లోనూ నటించి ఆకట్టుకుంది. యువ నటుడు మాగంటి శ్రీనాథ్… ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటించి మెప్పించారు. అతనికి జోడీగా నటించిన దివి పాత్ర కూడా కాసేపు ఆకట్టుకుంటుంది. అలాగే ఏసీపీ పాత్రలో నటించిన వశిష్ఠ సింహా పాత్ర… త్రూ అవుట్ సినిమా సాగుతుంది. అతని నటన కూడా సీరియస్ గా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. అతనికి సహాయ నటులుగా చేసిన ఇద్దరి పోలీసు పాత్రలు కూడా బాగున్నాయి. నటుడు అనీష్ కురువిల్లా… డాక్టర్ ఇరాన్ పాత్రలో ఎప్పటిలాగే ఆయన లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటారు. విలన్ పాత్రలు పోషించిన దుల్హన్ కబీర్ సింగ్, ప్రదీప్ పాత్రలు రౌద్రంగా చూపించారు. అందుకు తగ్గట్టుగానే నటించారు వీరు. ఇక పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి పాత్రలో జగపతిబాబు పోషించిన సింబా పాత్ర హైలైట్. అతని ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పించడం సామాన్యులకు సైతం అర్థమవుతుంది. అతని భార్య తులసిగా నటి కస్తూరి నటించారు. సైకియాట్రిస్ట్ పాత్రలో నటి గౌతమి పాత్ర పర్వాలేదు. ఆమె ద్వారా కొన్ని కేస్ స్టడీస్ ని చెప్పించి… సినిమాలోని పాత్రలకు ఓ కన్ క్లూజన్ చివర్లో ఇప్పించడం అందరినీ కన్వెన్స్ చేస్తుంది.

ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ కాబట్టి… దాని చుట్టూ రాసుకున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను కేస్ స్టడీస్ తో దర్శకుడు సంపత్ నంది బాగా కూర్పు చేసుకున్నారు. దానిని దర్శకుడు మురళీ మోహన్ రెడ్డి తెరపై బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సినిమా తనకి డెబ్యూనే అయినా… ఎక్కడా తడబాటు లేకుండా క్లీన్ మూవీగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. విజువల్స్ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగ కంపోజ్ చేశారు. ఫైట్స్ కంపోజింగ్ కూడా కొత్తగా వుంది. పెద్ద హీరోల సినిమాల్లో వుండే ఫైట్స్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా అనసూయ… సంప్రదాయ చీరకట్టుతో చేసే ఫైట్స్ మాస్ ను ఆకట్టుకుంటాయి. నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని చాలా క్వాలిటీగా నిర్మించారు. ఈ వారం సరదాగా చూసేయండి.
రేటింగ్: 3

Previous Post

ఏపి – కర్ణాటకల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్ష ; పవన్ కళ్యాణ్

Next Post

”ది డీల్” సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ

Next Post
”ది డీల్” సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ

''ది డీల్'' సినిమా పోస్టర్‌ ఆవిష్కరణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “బెనాక గోల్డ్” యాన్యువల్ సెలబ్రేషన్స్

by admin
July 24, 2026
0

...

Read more
నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

నేషనల్ అవార్డ్స్ విన్నింగ్ మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత, హీరోల కాంబినేషన్ లో మరో కొత్త సినిమా!

July 21, 2026
‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

July 10, 2026
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In