• Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఘనంగా IQ మూవీ ప్రారంభం

admin by admin
June 18, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter


ప్రముఖ నిర్మాత కె. యస్. రామారవు, మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన “IQ”

కాయగూరల లక్ష్మీ పతి సమర్పణలో శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై సాయి చరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శక, నిర్మాణ సారద్యంలో తెరకెక్కుతున్న “IQ” చిత్రానికి శ్రీ కాయగూరల లక్ష్మీ పతి, ,శ్రీ కాయగూరల శ్రీనివాసులు కలసి జ్యోతి ప్రజ్వలనతో ప్రసాద్ ల్యాబ్ లో సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య IQ చిత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె. యస్. రామారవు గారు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో

ముఖ్య అతిథిగా వచ్చిన ఘంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సినిమా చిన్నదైనా పెద్దదైనా మంచి కంటెంట్ ఉంటే కచ్చితంగా ప్రేకాకధారణ పొందుతుంది.iQ అనే యూత్ ఫుల్ సబ్జెక్టు తో వస్తున్న IQ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి. అలాగే కె. యస్. రామారవు గారు చెప్పిన జాగ్రత్తలు అన్ని పాటిస్తూ నిర్మాతలు అనుకున్న బడ్జెట్ లో సినిమా తియ్యాలి. ఈ చిత్ర హీరో ను చూస్తుంటే డి. జె. టిల్లు హీరో గుర్తుకు వస్తున్నాడు. ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్ అందరికీ ఈ సినిమా మంచి పేరు రావాలని కోరుతూ ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నిర్మాత కె. యస్. రామారావు గారు మాట్లాడుతూ..”IQ” అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది.ప్రేక్షకులకు నచ్చే విధంగా ప్రతి సీన్ కొత్త దనంగా ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు. సబ్జెక్ట్ రిఖ్వైర్ మెంట్ ను బట్టి హంపి లాంటి ప్రదేశాన్ని ఎన్నుకున్నారు కాబట్టి ఖర్చు కాస్తా ఎక్కువగానే అయ్యి ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకులలోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అయితే “iQ” అనే టైటిల్ అందరికి అర్థమవ్వడం కష్టం.ఇలాంటి మంచి చిత్రాన్ని దర్శక, నిర్మాతలు ఎంత ఎక్కువగా ప్రమోషన్ చేసుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ఇండస్ట్రీ లో దిల్ రాజు, సురేష్ బాబు సునీల్ నారంగ్ , అల్లు అరవింద్ ఈ నలుగురికి నచ్చితేనే అది తెరపైకి(థియేటర్స్) వస్తుంది. కాబట్టి వారికిది కచ్చితంగా నచ్చాలి. ఇకప్పుడు సినిమా లకు టీవి ఇక్కటే విరోధిగా ఉండేది. ఇప్పుడు ఓటిటి కూడా విరోధిగా తయారయ్యింది.కరోనా తర్వాత కొత్త నిర్మాతలు సినిమా తియ్యడానికి ముందుకు రావడం మంచిదే కానీ ప్రతి విషయంలోను ఆచి తూచి అడుగులు వెయ్యాలి. అలాగే ఈ “iQ” సినిమాను ప్రేక్షకులలొకి వెళ్లేలా చేయండి. మంచి సబ్జెక్ట్ తో తీస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

 

చిత్ర దర్శక,నిర్మాత శ్రీనివాస్ GLB మాట్లాడుతూ…మేము పిలవగానే వచ్చిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు ఘంటా శ్రీనివాసరావు, ప్రముఖ నిర్మాత కె. యస్. రామారవు తదితర పెద్దలకు ధన్యవాదములు. నాకు మంచి యూనిక్ ఉన్న సబ్జెక్టు లభించడంతో ఈ సినిమా చేస్తున్నాను.యూత్ కు సంబంభించిన మూవీ “IQ”. IQ అంటే మేధస్సుకు సంబందించిన చిత్రం. ఈ చిత్రంలో హీరోయిన్ చాలా ఇంటెలిజెంట్ గా కనిపిస్తుంది.మంచి కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ చిత్రానికి మంచి నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ చక్కగా కుదిరారు. ఈ సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు ఘటికాచలం గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.మేము చేస్తున్న ఈ చిత్రానికి మీరందరి సపోర్ట్ కావాలని కోరుతున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు ఘటికాచలం మాట్లాడుతూ …ఇది ఒక బ్రెయిన్ కు సంబందించిన సినిమా.. యూత్ బ్యాక్ డ్రాప్ లో తెరకేక్కిస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరో సాయి చరణ్ మాట్లాడుతూ.. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.సినిమాలో నటించాలి అంటే సినిమా బ్యాగ్రౌండ్ ఉండాలి అని విన్నాను అయితే నాకు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి సినిమాలో రావడానికి మెదట భయమేసింది కానీ సినిమాలో నటించాలనే ఆసక్తితో సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటున్న నేను నా జాబ్ కు రిజైన్ చేసి సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకొని వచ్చాను. ఈ రోజు నేను చేస్తున్న “IQ” సినిమాను, నన్ను ఆశీర్వదించ డానికి వచ్చిన ఇంతమంది పెద్దలను చూసి నా భయం అంతా పోయింది. ఇదే జోష్ తో సినిమాలో నటించి మంచి పేరు తెచ్చు కుంటాను. ఇక్కడకు వచ్చిన వారందరికీ ధన్యవాదములు అన్నారు.

GLB లక్ష్మణ్ మాట్లాడుతూ.. తమ్ముడు శ్రీనివాస్ తీస్తున్న “IQ” చిత్రం అందరికీ చేరువ అవ్వాలని కోరుతూ ఈ సినిమా అందరి హృదయాలలోకి వెళ్లి పెద్ద విజయం సాదించాలి అన్నారు.

TRS నాయకుడు పండరీ గౌడ్ మాట్లాడుతూ..కరోనా తరువాత మంచి సబ్జెక్టు తో తీస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి.అలాగే ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ లకు మంచి పేరు రావాలి.నిర్మాత కె. యస్. రామారవు గారు చెప్పిన జాగ్రత్తలు అన్ని పాటించాలని కోరుతున్నాను.అన్నారు.

చిత్ర హీరోయిన్ పల్లవి మాట్లాడుతూ..ఇది నా రెండవ చిత్రం ఈ చిత్రం లో నా పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నాకిలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు అన్నారు.

మరో నటి ట్ర్యాన్సీ మాట్లాడుతూ .. నాకే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదములు. పెద్దలందరికీ నా నమ్మాస్కర్లు. నా కాలేజీ ఆర్టిస్ట్ సాయి చరణ్ పల్లవిలాల్తీ కలాసి బ్యాటించడానికి ఆసక్తిహా ఎదురుచూస్తున్నాను.

నటీ నటులు
సాయి చరణ్, పల్లవి,ట్ర్యాన్సీ, ధన్ రాజ్, లక్ష్మీ రావు,
పార్వతి రాథోడ్, చిత్రం శీను, సత్తిపండు, జ్ఞానేశ్వర్ రావు మూర్గి,గుండు అశోక్ కుమార్, శీలం శ్రీనివాసరావు, ప్రియ, సీఎం రెడ్డి, శ్రీనాథ్ దబ్బర,వాసు వర్మ

సాంకేతిక నిపుణులు
సమర్పణ : కాయగూరల లక్ష్మీ పతి
బ్యానర్ : శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత,దర్శకత్వం : శ్రీనివాస్
నిర్మాత : బొమ్మ దేవర రామచంద్ర రావు
కెమెరా : టి. సురేందర్ రెడ్డి
సంగీతం, మాటలు : పోలూరు ఘటికాచలం
ఎడిటింగ్ : నందమూరి హరి
పాటలు : భాస్కరపట్ల – పి. నాగేంద్ర ప్రసాద్
పోస్టర్ డిజైనర్ : రాంబాబు
పి ఆర్ ఓ : మల్లాల మూర్తి
ప్రొడక్షన్ మేనేజర్ : టి ప్రకాష్
కో డైరెక్టర్ : దివాకర్ ఎడ్ల
అసిస్టెంట్ డైరెక్టర్ : శ్రీను జి

Previous Post

1998 డీఎస్సీ అభ్యర్థులకు తీపికబురు

Next Post

తకిట తదిమి తందాన… చిత్రం ప్రారంభం

Next Post

తకిట తదిమి తందాన... చిత్రం ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

మైనార్టీ పథకాలను రద్దు చేయడం సిగ్గుచేటు!!
politics

మైనార్టీ పథకాలను రద్దు చేయడం సిగ్గుచేటు!!

by admin
July 4, 2022
0

...

Read more
రికార్డు స్థాయిలో శ్రీవారి హుండి ఆదాయం!

రికార్డు స్థాయిలో శ్రీవారి హుండి ఆదాయం!

July 4, 2022
ప్రభుత్వ విప్ పిచ్చి చేష్టలు

ప్రభుత్వ విప్ పిచ్చి చేష్టలు

July 4, 2022

మా నాన్న నక్సలైట్ జూలై 8న విడుదల

July 4, 2022

నిత్యం స్ఫూర్తిని నింపే…ప్రశాంత్ రెడ్డి

July 3, 2022
నిధి అగర్వాల్ లేటెస్ట్ స్టిల్స్

నిధి అగర్వాల్ లేటెస్ట్ స్టిల్స్

July 3, 2022
These pictures of #Lavanya in a stunning pink saree got us all lovestruck! 💞💖

These pictures of #Lavanya in a stunning pink saree got us all lovestruck! 💞💖

July 2, 2022
శ్రీచైత్యన విద్యాసంస్థలు గుర్తింపును రద్దు చేయాలి!

శ్రీచైత్యన విద్యాసంస్థలు గుర్తింపును రద్దు చేయాలి!

July 2, 2022
ఏపీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే లకు కోవిడ్

ఏపీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే లకు కోవిడ్

July 2, 2022
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • Sample Page
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In