కృష్ణా జిల్లా, గుడివాడ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు శ్రీ పాలంకి వెంకట కృష్ణ సారధిబాబు, పారిశ్రామికవేత్త శ్రీ పాలంకి వెంకట కృష్ణ మోహన్ బాబు జనసేన పార్టీలో చేరారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వీరికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్, నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు, సంయుక్త కార్యదర్శి శ్రీమతి పోతిరెడ్డి అనిత, పార్టీ నేతలు శ్రీ డి.వరప్రసాద్, శ్రీమతి రావి సౌజన్య, శ్రీ మండలి రాజేష్, శ్రీ సందు పవన్ తదితరులు పాల్గొన్నారు.