• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

స్పైన్ చిల్లింగ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’

admin by admin
June 20, 2023
in movies, reviews
0 0
0
స్పైన్ చిల్లింగ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అశ్విన్స్’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సైకలాజికల్ హారర్ థ్రిల్లర్స్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ ఉంది. అందుకే డెబ్యూ డైరెక్టర్లు ఇలాంటి కథ.. కథనాలతో మూవీస్ ని తెరకెక్కిస్తూ… బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తున్నారు. ఇలాంటి వాటిని తెరకెక్కించేటప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా లెక్కలోకి తీసుకుని… బుల్లితెరపైనా విజయం అందుకుంటున్నారు. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘అశ్విన్స్’ ఇలాంటి జోనర్ లో తెరకెక్కిందే. ‘తారామణి’ ఫేం వసంత్ రవి… మరో నలుగురు కలిసి నటించిన ఈ చిత్రం జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ప్రమోషన్స్ కూడా విభిన్నంగా చేస్తోంది చిత్ర బృందం. తమ చిత్రాన్ని కేవలం 18 సం.లకు పై బడిన వారు మాత్రమే చూడాలంటూ… ఇందులో ఎంత హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయో… ఒక రకంగా థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకులకు హింట్ కూడా ఇస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే సెన్సార్ వారు కూడా ఈ చిత్రానికి ఎ సర్టిఫికేట్ ఇచ్చారు కూడా. మరి ఈ చిత్రంలో అంతగా భయపెట్టే హారర్ ఎలిమెంట్స్ ఏమున్నాయో చూద్దాం పదండి.

ఈ చిత్రం కథ… స్థూలంగా ఏంటంటే… ఓ ఊరిలో రైతు… ఆ రైతుకు ఇద్దరు కుమారులు. వారు చెరువులో మునిగి చనిపోతారు. తన ప్రాణ సమానులైన ఇద్దరు కుమారులు చనిపోవడంతో… ఆ రైతు… అశ్వినీదేవతల కోసం ఘోర తపస్సు చేసి… తన కుమారులను ఎలాగైనా బతికించాలని వేడుకుంటాడు. దాంతో అశ్వినీదేవతలు ప్రత్యక్షమై… ఓ కుమారుడిని మాత్రమే బతికించి… అతనికి ప్రకృతి కారణంగా మాత్రమే మరణం సంభవిస్తుందని… మరే ఇతర రకంగానూ… ప్రాణాపాయం ఉండదని… ఓ రెండు బొమ్మలను ఎల్లవేళలతో తన కుమారుని వద్దనే ఉంచమని ఆ రైతుకు దేవతలు సూచిస్తారు. ఇది విన్న రాక్షస ఆత్మ… ఎలాగైనా… ఆ రెండు బొమ్మలలో ఓ బొమ్మను ఆ కుర్రాడి చేతి నుంచి తీసుకుని… రాక్షస సంతతినంతా… భూమి మీదకు తీసుకురావాలని తలస్తాడు. అనుకున్న విధంగానే ఆ రెండు బొమ్మలలో ఒక బొమ్మను… ఆ కుర్రాడి నుంచి పొందడానికి… నీ దగ్గర వున్న బొమ్మలలో ఒక బొమ్మను ఇస్తే… నీ సోదరుడిని బతికిస్తా… అంటూ నమ్మబలికి… ఆ కుర్రాడి చేతిలో ఉన్న బొమ్మను తీసుకుంటుంది రాక్షస ఆత్మ. మరి ఇలా పొందిన ఆ రాక్షస ఆత్మ… తరువాత ఏమి చేసిందనేదే మిగతా కథ.
దర్శకుడు తరుణ్ తేజ ఎంచుకున్న ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ తో… ఓ మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ప్రతి మనిషిలోనూ రెండు పర్శ్వాలుంటాయి. అందులో మంచి ఒకటి కాగా మరొకటి చెడు. ఈ రెండింటినీ కంట్రోల్ చేసే శక్తి కూడా మనిషికే ఉంటుందని చూపించారు. మనిషి బుద్ధి మంచి వైపు వెళదామని చెబితే… మనసు మాత్ర చెడు వైపు చూయిస్తుంది. దానిని మనం ఎంతో నిగ్రహంతో మంచి వైపు ప్రయాణించడానికే ప్రయత్నించాలని ఇన్నర్ మెసేజ్ ఇచ్చాడు… హీరో పాత్ర పోషించిన వసంత్ రవి పోషించిన రెండు పాత్రల ద్వారా. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్ హారర్ చిత్రాల్లోలాగే… ఓ పెద్ద భవంతిలోకి ఓ ఐదుగురు యువకులను తీసుకెళ్ళి… అక్కడ చిత్ర విచిత్ర సౌండ్లతో ఆడియన్స్ ని హారర్ ఎత్తించడానికి చేసిన ప్రయత్నాలు ఓ మోస్తారుగా సక్సెస్ అయ్యాయి. అయితే… సెకెండాఫ్ లో ఆర్కియాలజిస్ట్… ఆర్తి రాజగోపాల్(విమలా రామన్) చాప్టర్ తో అసలు సినిమా స్వభావం ఏంటో తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో భయపెట్టి… సెకెండాఫ్ లో అసలు కథలోకి వెల్లడంతో ప్రేక్షకులు ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కి బాగా ఎంగేజ్ అవుతారు.

ఇందులో మెయిన్ లీడ్ లో అర్జున్ పాత్రలో కనిపించిన హీరో వసంత్ రవి… రెండు పాత్రలలోనూ వేరియేషన్ చూపించి… ఆకట్టుకున్నారు. ఈ పాత్ర తరువాత విమలా రామన్ పాత్రకే చెప్పుకోదగ్గ ప్రాధాన్యత ఉంది. చాలా కాలం తరువాత ఆర్కియాలజిస్టుగా మంచి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. మిగతా నాలుగు పాత్రలు ఓకే. ఇందులో డైరెక్టర్ రాజీవ్ మీనన్ కుమార్తె సరస్వతీ మీనన్ కూడా ఓ పాత్ర పోషించారు.

విజయ్ సిద్ధార్థ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్… ఆడియన్స్ ని ఓ రేంజ్ లో భయపెడుతుంది. ఎ.ఎం.ఎడ్విన్ సాకే సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ వెంకట్రాజన్ సినిమా నిడివిని ఇంకాస్త తగ్గిస్తే బాగుండు. నిర్మాత బి.వి.ఎస్.రవి నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3

Previous Post

అండీ … అండీ అంటూనే బాగా ఏసేశాడు

Next Post

దత్తపుత్రుడు అని జగన్ గారు ఎందుకు పేరు పెట్టారో ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్ని చూస్తే మరోసారి మరింతగా అర్థమౌతుంది.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్
movies

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

by admin
September 5, 2026
0

...

Read more
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In