* పుంగనూరు సీన్ భీమవరంలో రిపీట్
* హింసను ప్రేరేపించిన వైనం
* వైసిపి కార్యకర్తలపై దాడులు
ప్రేమతో గెలవలేనపుడు భయపెట్టి తమవైపు లాక్కోవాలి. సొంతంగా పాస్ కాలేనపుడు మాస్ కాపీయింగ్ చేయాలి.. దమ్ముతో ఒడ్డు దాటలేనపుడు డ్రగ్స్ తో కొట్టాలి.. సొంత సత్తాతో కానిపని కిరాయి మనుషులతో చేయించాలి.. ఇదీ చంద్రబాబు కాన్సెప్ట్.. నలభయ్యేళ్ళ రాజకీయ జీవితంలో అయన పాటించే సూత్రం ఇదే.. ఇన్నాళ్లుగా అయన ఇదే తరహాలో రాజకీయం చేస్తూ వస్తున్నారు.. ఇకముందు కూడా అదే పాలసీ ఫాలో అవుతారు. ఆశ్చర్యంగా లోకేష్ కూడా ఇదే మార్గంలో నడుస్తున్నారు.
కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని, మూడుశాఖల మాజీమంత్రి ఇప్పుడు హింసను నమ్ముకుని, ప్రజల్ని బెదిరించి, కార్యకర్తలను ఉసిగొల్పి తన వీరత్వాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. అచ్చం మొన్న పుంగనూరులో జరిగినట్లే నేను భీమవరంలో అల్లర్లకు ప్లాన్ చేశారు. పుంగనూరు టౌన్లోకి వెళ్లేందుకు అనుమతులు తీసుకోనున్నా పోలీసులను ఎదిరించి బెదిరించి చివరకు దాడి చేసి అయినా నగరంలోకి ప్రవేశించాలన్న చంద్రబాబు కుట్రకు పలువురు పోలీసులు గాయపడ్డారు. అయినాసరే ప్రజల దృష్టిలో తాను హీరోను అవ్వాలనే కోరికతో తన్నండి.. పోలీసులకు కొట్టండి అని కార్యకర్తలను రెచ్చగొట్టి ఆ హింసకు ఆజ్యం పోసిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారు. కానీ వందలాది మంది టిడిపి కార్యకర్తలు కేసులపాలయ్యారు. పదుల సంఖ్యలో పోలీసులు ఆస్పత్రిపాలయ్యారు. ఏదైతేనేం చంద్రబాబు ప్లాన్ సక్సెస్ అయింది.
అదే స్కెచ్… సేమ్ ప్లాన్
పుంగనూరులో టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు సారధ్యంలో హింసకు ప్లాన్ చేసినట్లే ఇప్పుడు పచ్చని గోదావరి జిల్లాలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సారధ్యంలో టిడిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. లోకేష్ పాదయాత్ర సాగుతుండగానే కర్రలు.. బియర్ సీసాలతో వైసిపి కార్యకర్తలమీద విరుచుకుపడ్డారు. రాళ్లతో దాడులు చేశారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు చించేస్తూ కేకలు.. అరుపులతో ఆ ప్రాంతాన్ని భయానకంగా మార్చేశారు.
అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామం చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు. వైసిపి కార్యకర్తలు సైతం భయంతో ఇళ్లలోకి వెళ్లి దాక్కున్నారు. ఈ దాదాగిరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. కేవలం హింసను ప్రేరేపించి హీరోఅవ్వాలని చూస్తున్న లోకేష్ ఈ మేరకు భాషను సైతం అలాగే వాడుతున్నారు. ఒక్కోడ్ని ఉచ్చ పోయిస్తాను.. ఎర్ర బుక్కులో పేర్లు రాస్తున్నాను అంటూ బెదిరిస్తూ తమ కార్యకర్తలను రౌడీల మాదిరి రెచ్చగొడుతున్నారు. కనీసం డజన్ కేసులైనా పెట్టించుకోకపోతే ఎందుకూ దండగ ? ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవి ఇస్తాను అంటూ లోకేష్ ఇచ్చిన బూస్ట్ ను చూసి టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు ప్రజల్లో తమ పార్టీకి ఉన్న పరపతి రోజురోజుకూ తగ్గిపోతుండడంతో గూండాగిరీని నమ్ముకుని ప్రజల్లో నిలవాలని తండ్రి చేసినట్లుగానే ఇప్పుడు లోకేష్ కూడా చేస్తూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు.