రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి గారి మనుమరాలు బేబీ నిహిర తన జన్మదిన సందర్బముగా కొంపల్లి లోని తన నివాసములో తల్లి దండ్రులైన ప్రశాంత్ రెడ్డి , హరితల ప్రోత్సాహముతో మొక్కను నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ, బాల్యంలో ఈ విధమైన మంచి పనులు చేయడం అలవాటు చేస్తే భవిష్యత్ లో వారికి మంచి చేసిన వారం అవుతామని , దీనికి ప్రేరణ అయిన కూతురు హరిత , ప్రశాంత్ రెడ్డి లను అభినందించారు.
పసి ప్రాయంలో కూడా మొక్కలు నాటలన్న సంకల్ప బలము కల్పించిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేది ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని, ఎలాంటి అవకాశం దొరికినా, ఎలాంటి సంధర్బములోనైనా మొక్కలు నాటి హరిత తెలంగాణా కొరకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.