గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి యాక్ట్ చేసిన చిత్రం SPEED220. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదల సంధర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…. మంచి స్టోరీతో మా దర్శకుడు హర్ష మా దగ్గరికి రావడం జరిగింది. అంతేకాదు దాన్ని అంతే అత్యుద్భుతంగా తెరకెక్కించారు. కథ వినిన వెంటనే మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలి అని డిసైడ్ అయ్యాము.
ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో లవ్ వల్ల కలిగే ఇబ్బందులు.. ప్రేమికులు మధ్య ఉండే సంఘర్షణ కళ్లకి కనిపించే విధంగా దర్శకుడు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.
చిత్ర దర్శకుడు హర్ష బీజగం మాట్లాడుతూ… నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆర్ఎక్స్ 100 లాగ ఇది ‘రా’ లవ్ స్టోరీ. ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ అవుతుందనే విశ్వాసం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి సంగీతం శేఖర్ మోపురి అందించారు. కెమెరామెన్ గా క్రాంతి కుమార్ వ్యవహరించారు. మరోవైపు ఎడిటర్ గా రామకృష్ణ వ్యవహరించారు. టెక్నిషియన్స్ అందరూ వాళ్ల శాఖలలో అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు ఈ SPEED 220 చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నామన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.