తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తేదీ 10.05.2026 ఆదివారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు పలువురు సినీ, టీవీ ప్రముఖుల సమక్షంలో మొట్టమొదటిసారిగా పలు డబ్బింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డబ్బింగ్ కళాకారులకు “వాగ్దేవి అవార్డ్స్ “అంగరంగ వైభవంగా ప్రసాద్ లాబ్స్ లో ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అతిథులుగా గౌ: శ్రీ. నవీన్ యాదవ్ (జూబ్లీహిల్స్ శాసనసభ్యులు), శ్రీ ఈ గంగాధర్ (అడిషనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ ,తెలంగాణ), ప్రముఖ సినీ నటులు శివాజీ రాజా, ప్రముఖ మూవీ ఆర్టిస్ట్ శ్రీ రాజీవ్ కనకాల, శ్రీ ఏ. ప్రసాదరావు. ( ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్), శ్రీ కొయ్యలమూడి రాకేష్ (నాని) (TTDWTF ప్రెసిడెంట్), శ్రీ గోగినేని ప్రసాద్ (మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్), పి. ప్రభాకర్ (సినీ, టీవీ నటులు), కాదంబరి కిరణ్ (సినీ నటులు), ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీ Rcm రాజుగారు (టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు), తదితరులు పాల్గొన్నారు. TTDMODAUT కార్యవర్గ సభ్యులు ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వర్మ, వైస్ ప్రెసిడెంట్ లలితా రాజ్, జనరల్ సెక్రెటరీ C.N . గౌతమ్, ట్రెజరర్ పి. వినోద్ కుమార్, జాయింట్ సెక్రెటరీ సాహితి, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ శ్యాంసుందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పి అనురాధ, సాయి ప్రసాద్, సునీల్ రెడ్డి, సమరసింహారెడ్డి, అనిల్ కుమార్ కార్యవర్గ నిర్వహణ లో, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో డబ్బింగ్ ఆర్టిస్టుల ప్రతిభను గుర్తించి మొట్టమొదటిసారిగా “వాగ్దేవి అవార్డ్స్” బహుకరించడం జరిగింది.









