• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

admin by admin
May 31, 2026
in movies
0 0
0
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత (రాను బొంబాయికి రాను సాంగ్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సాV3”. ఈ చిత్రాన్ని లక్ష్మి కృష్ణ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా నిర్మాత వి. విజయ నిర్మిస్తున్నారు. నటుడు, దర్శకుడు కృష్ణ మాయ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో “సాV3” సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

అతిథిగా వచ్చిన నిర్మాత అశోక్ కుమార్ మాట్లాడుతూ – కృష్ణమాయ సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి. ఆర్ట్ డైరెక్టర్, నటుడు, రైటర్..ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇతను నాకు ప్రేమించుకుందాం రా టైమ్ నుంచి తెలుసు. మా ఈశ్వర్ మూవీలో కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. సినిమాలు రిస్క్ వద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. అయినా తనకున్న ప్యాషన్ తో మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీ కొంత స్లంప్ లో ఉంది. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. థియేటర్స్ కు వచ్చేది యూత్ కాబట్టి కృష్ణమాయ మంచి యూత్ ఫుల్ మూవీ చేస్తున్నాడు. ఒక ప్లాన్ ప్రకారం సినిమా చేసుకోవడం నా దగ్గర నుంచే నేర్చుకున్నాని చెబుతుంటాడు. ఈ సినిమాను కూడా అలాగే ప్లాన్డ్ గా రూపొందించి కంప్లీట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించి కృష్ణమాయ మరిన్ని చిత్రాలు చేసే సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ – మా లక్ష్మి కృష్ణ బ్యానర్ పై గతంలో రైల్వే స్టేషన్ అనే చిత్రాన్ని రూపొందించాం. ఇప్పుడు ఈ బ్యానర్ లో చేస్తున్న రెండో సినిమా “సాV3”. ఈ టైటిల్ ఇలా పెట్టేందుకు ఓ కారణం ఉంది. సా అంటే సావిత్రి హీరోయిన్ పేరు. అలాగే వి అంటే విజయ్ కుమార్ అంటే డీమోన్ పవన్ పేరుంది. 3లో త్రివిక్రమ్ రాజు అంటే సామ్రాట్ చేస్తున్న క్యారెక్టర్. “సాV3” సినిమాను కంప్లీట్ చేశాక పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ పూజా కార్యక్రమాలకు కూడా ఖర్చు పెట్టగలమో లేదో అని ముందే నిర్వహించలేదు. సినిమా అంతే కంప్లీట్ చేసుకుని, డబ్బింగ్ కంప్లీట్ చేసుకుని ఎడిటింగ్ చేస్తున్న టైమ్ లో హ్యాపీగా ఈ పూజా కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఇదొక వెరైటీ అనుకోవచ్చు. ప్రొడక్షన్ ఖర్చుపరంగా సేఫ్ గా వెళ్తున్నామని అనుకోవచ్చు. లిఖి, డీమోన్ పవన్ కొత్త వాళ్లు ఎలా నటిస్తారో అనుకున్నాను గానీ పర్ ఫార్మెన్స్ ఇరగదీశారు. వాళ్లకు ఇప్పటిదాకా సరైన మూవీ రాలేదని అనిపించింది. సాయి కార్తీక్ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తుంది. మా టెక్నీషియన్స్ అందరూ అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. “సాV3” సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.

హీరో సామ్రాట్ మాట్లాడుతూ – నేను బిజినెస్ పనుల్లో పడి ఈ మధ్య ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటున్నాను. ఇటీవల ఓ ప్రైవేట్ సాంగ్ చేశాను. ఆ సాంగ్ షూట్ టైమ్ లో డైరెక్టర్ కృష్ణమాయ గారు కలిసి ఈ స్క్రిప్ట్ చెప్పారు. బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఇది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మూవీ సాగుతుంది. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని చేస్తున్న చిత్రమిది. షూటింగ్ కంప్లీట్ చేశా. చాలా ప్లాన్డ్ గా, ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేశాం. లిఖిత ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తుంది. నేను 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సమ్ థింగ్ సమ్ థింగ్ అనే మూవీ చేశాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలాంటి మంచి క్యారెక్టర్ నాకు దొరకలేదు. ఇలాంటి డైరెక్టర్ దొరకలేదు. ఈ చిత్రంతో ఒక కొత్త సామ్రాట్ ను ప్రేక్షకులు చూస్తారు. మా డైరెక్టర్ మా దగ్గర నుంచి తనకు కావాల్సిన పర్ ఫార్మెన్స్ తీసుకున్నారు.

హీరో డీమోన్ పవన్ మాట్లాడుతూ – బిగ్ బాస్ తర్వాత నేను ఎలాంటి మూవీ చేయాలని ఆలోచిస్తున్న టైమ్ లో డైరెక్టర్ కృష్ణ మాయ గారు ఈ స్క్రిప్ట్ చెప్పారు. చాలా మంచి స్క్రిప్ట్ ఇది. ఆయన స్క్రిప్ట్ చెబుతుంటే ఇంకా వినాలని అనిపించింది. అంత ఎక్స్ ప్రెసివ్ గా స్టోరీ చెప్పారు. ఇలాంటి దర్శకుడితో వర్క్ చేస్తే నటుడిగా నాకు మంచి పేరొస్తుందని నమ్మాను. మేమంతా ఈ సినిమా కోసం ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఆన్ సెట్ ఇంప్రూవైజ్ చేసుకుంటూ నాచురల్ గా నటించాం. సామ్రాట్ గారి క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. అలాగే లిఖితకు హీరోయిన్ గా మంచి పేరు వస్తుంది. తక్కువ టైమ్ లో మేమంతా క్వాలిటీగా సినిమా చేశాం. అన్నారు.

హీరోయిన్ లిఖిత మాట్లాడుతూ – డైరెక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చెబుతున్నప్పుడే మూవీ ఎలా ఉంటుంది అనేది క్లియర్ గా తెలిసింది. నేను ఫోక్ సాంగ్స్ నుంచి చిన్న గ్యాప్ తీసుకున్నాను. హీరోయిన్ గా మంచి రోల్స్ చేయాలనే ఫోక్ సాంగ్స్ కు గ్యాప్ ఇచ్చాను. అయినా మంచి ఆల్బమ్ వస్తే తప్పకుండా చేస్తాను. నేను ఒక బెస్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో ఈ మూవీ ఆఫర్ వచ్చింది. సామ్రాట్, పవన్ లాంటి కోస్టార్స్ దొరకడం హ్యాపీగా ఉంది. వాళ్లు తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు. ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీపడకుండా మా విజయ గారు నిర్మించారు. ఎలాంటి స్క్రిప్ట్ పేపర్ లేకుండా మేమంతా కథను ఓన్ చేసుకుని నటించాం. అదంతా మా డైరెక్టర్ వల్లే సాధ్యమైంది. అన్నారు.

ప్రొడ్యూసర్ వి. విజయ మాట్లాడుతూ – “సాV3” వంచి మంచి చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఈ మూవీతో పెద్ద విజయాన్ని అందుకోబోతున్నాం. మా ఆర్టిస్టులంతా తమ పర్ ఫార్మెన్స్ లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారు. అన్నారు.

నటీనటులు – సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత, తదితరులు

టెక్నికల్ టీమ్
———————
స్టంట్స్ – అఖిల్
ఎడిటర్ – శివ శర్వాణి
డీవోపీ – పవన్ మణి
మ్యూజిక్ డైరెక్టర్ – సాయి కార్తీక్
ప్రొడ్యూసర్ – వి. విజయ
ఆర్ట్ డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ – కృష్ణ మాయ
పీఆర్ఓ – బి.వీరబాబు

Previous Post

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

Next Post

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

Next Post
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ "ఈశ్వర్" సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా "సాV3" మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్
movies

‘లెనిన్’ కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్

by admin
July 10, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

July 6, 2026
తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి విజువల్స్ అందిస్తున్న క్రియేటివ్ VFX సూపర్‌వైజర్… రాంజీ డాట్

July 4, 2026
రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

June 19, 2026
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In