తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగానే వచ్చాయి. అయితే వీటిలో ఓ సర్వే సంస్థ మాత్రం కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని తెలిపింది. స్మార్ట్ పోల్ పేరుతో ఆ సంస్థ తమ ఫలితాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ఆ సంస్థ కాంగ్రెస్ కు 70 నుంచి 80 సీట్ల మధ్యలో రావచ్చని తెలిపింది. అనేక సంస్థలు తమ సర్వే ఫలితాలను ప్రకటించినా అందరికన్నా ఎక్కువ సీట్లు రావచ్చని తెలిపింది మాత్రం స్మార్ట్ పోల్ సర్వేనే. మూడు దశలుగా ఈ సంస్థ సర్వే నిర్వహించడమే కాకుండా దాదాపు 66 నియోజక వర్గాల నుంచి 7500 శాంపిల్స్ తో ఎగ్జిట్ పోల్స్ చేసింది.
సర్వే దశల వారీగా..
మొదటి సర్వే ఈ ఏడాది సెప్టెంబరు 4 నుంచి 30 వరకు చేసింది. అప్పుడు 42 నియోజక వర్గాల నుంచి 30 వేల శాంపిల్స్ సేకరించి విశ్లేషణ జరిపింది. ఆ తర్వాత 2వ దశ సర్వేను అక్టోబరు 26న ప్రారంభించి నవంబరు 11 వరకు కొనసాగించింది. ఒకవిధంగా ఇది ప్రీ నామినేషన్ స్టేజ్ అనాల్సి ఉంటుంది. అప్పుడు 65 నియోజక వర్గాల నుంచి 28 వేల శాంపిల్స్ సేకరించింది. ఇక మూడో దశ సర్వేను నవంబరు 14న మొదలు పెట్టి 28 వరకు జరిపింది. అంటే ఎన్నికలు జరగడానికి రెండు రోజుల ముందువరకు. దాదాపు 68 నియోజక వర్గాల నుంచి 30 వేల శాంపిల్స్ సేకరించి అంతకుముందు చేసిన రెండు దశల సర్వేలతో కలపి విశ్లేషించింది. ప్రశ్నలేమీ అడగకుండా కేవలం సీక్రెట్ బ్యాలెట్ నిర్వహించడం తమ సర్వే ప్రత్యేకత అని స్మార్ట్ పోల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసరావు తెలిపారు. తటస్థ ఓటర్ల నుంచి మాత్రమే ఇలాంటి సమాచారం సేకరించినట్టు ఆయన చెప్పారు. మొత్తం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 113 నియోజకవర్గాల నుంచి సర్వే చేశారు. ఒకటి రెండు సార్లు పరిశీలన చేసి ఈ ఫలితాలు తయారు చేసినట్టు వీరు చెబుతున్నారు. ఒక్క ఎంఐఎంకు చెందిన ఆరు నియోజక వర్గాల్లో మాత్రమే ఎలాంటి సర్వే చేపట్టలేదు.
సర్వే రాష్ట్ర వాప్తంగా గెలుపొందే సీట్లు
బీఆర్ఎస్ పార్టీ – 30 సీట్లు (+/-6) ( – (37.75 ఓటింగ్ శాతం
కాంగ్రెస్ – 76 సీట్లు (+/-6) – 40.50 శాతం
భాజపా – 5 సీట్లు (+/-2)- 13.50 శాతం
బీఎస్పీ – 1 సీటు – 2.15 శాతం
సీపీఐ – 1 సీటు – 0.30 శాతం
ఏఐఎంఐఎం – 6 సీట్లు – 2.65 శాతం.
స్వతంత్రులు – 0 – 2.42 శాతం.
నోటా – 0 – 1.03 శాతం.