• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

“రహస్య”ని చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్ అవుతారు- చిత్ర హీరో నివాస్

admin by admin
September 5, 2022
in movies
0 0
0
“రహస్య”ని చూసిన ప్రతి ఒక్కరూ థ్రిల్ అవుతారు- చిత్ర హీరో నివాస్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

“రహస్య” సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు..”రహస్య” ప్రి రిలీజ్ ఈవెంట్ లో హీరో నివాస్

సస్పెన్స్, థ్రిల్లర్,మిస్టరీ “రహస్య” ఈ నెల 9న గ్రాండ్ రిలీజ్

ఒక మంచం నుండి స్టార్ట్ అయిన మనం పుట్టుక చివరికి మన చావుతో ఒక మంచం పైనే ముగుస్తుంది. ఇలా ప్రతి మనిషి జీవితంలో మంచం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఒక మానవ జీవితంలో మనిషికి, మంచానికి ఉన్న రహస్య సంబంధం ఏమిటి ? అనే సస్పెన్స్, థ్రిల్లర్ కథా చిత్రమే “రహస్య”. SSS ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా శివ శ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి.S ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ కు ,గ్లిమ్స్ కు, పాటలకు, టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 9 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మీలో ఒకడు హీరో కుప్పిలి శ్రీనివాస్, హే బుజ్జి హీరో సతీష్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర హీరో నివాస్ మాట్లాడుతూ… చాలా మందికి యాక్టింగ్ చేయాలనే డ్రీమ్ ఉన్నా సరే అది ఒక్కొక్క సారి జరగక పోవచ్చు. అయితే కెనడా లో ఉన్న నా దగ్గరకు ఈ కథ రావడం ఇందులో హీరోగా విశ్వతేజ అనే పాత్రలో NIA అధికారికగా నటించడం చూస్తుంటే చాలా అదృష్టంగా బావిస్తున్నాను. థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో డిఫరెంట్ కోణాలను టచ్ చేస్తూ సస్పెన్స్ మిస్టరీని, కథను దర్శకుడు అనుకున్నట్లే చాలా బాగా తీశాడు. డైరెక్షన్ టీం అంతా చాలా కష్టపడ్డారు. నిర్మాతలు ఈ సినిమా బాగా రావాలని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు. చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇందులోని సాంగ్స్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సునీల్ కశ్యప్ గారు తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో మా సినిమాకు ప్రాణం పోశారు అని చెప్పవచ్చు. చంద్ర కిరణ్, ఉద్దవ్ లు కూడా సినిమా బెస్ట్ రావడానికి చాలా హానెస్ట్ గా వర్క్ చేశారు. హీరోయిన్ సారా చాలా చక్కటి నటనను కనబరచింది..ఇలా ప్రతి ఒక్కరు కష్టపడి చేయడం వలనే సినిమా బాగా వచ్చింది. *ఈనెల 9న* ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటుడు కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఒక మంచానికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ నెల 9వ తేదీ వరకు వెయిట్ చేసి థియేటర్స్ లలో చూడండి. చూస్తున్న ప్రతి మనిషిని థ్రిల్ కు గురి చేసేలా దర్శకుడు చాలా బాగా తెరకెక్కించడమే కాకుండా నిర్మాతలకు భారం కాకుండా తీసిన ప్రతి షార్ట్ లోనూ వేస్టేజ్ లేకుండా తీశాడని తెలిసింది. చరణ్ అర్జున్ మంచి మ్యూజిక్ చేశాడు. హీరో నివాస్ ప్రతి ఫ్రెమ్ లో చాలా చక్కగా నటించాడు. నిర్మాతలు ప్రతి క్షణం ఈ సినిమా బాగా రావాలని తపనపడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9 న వస్తున్న థ్రిల్లర్ మూవీ “రహస్య” చిత్రాన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర డైరెక్టర్ శివశ్రీ మీగడ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి దానికి ఒక రహస్యం ఉంటుంది. అలాగే మనం పుట్టుక దగ్గర నుంచి చనిపోయే వరకు మనకు మంచం ప్రధాన పాత్రపోసిస్తుంది. అయితే మనం వాడే ప్రతి మంచానికి మనిషికి ఉన్నటువంటి రహస్యమైన అభినవబావ సంబంధం ఏమిటీ అనే వేదాంత దొరణిలో రాసుకున్న కథే ఈ “రహస్య”. నేను స్క్రిప్ట్ ఎంత బాగా రాసుకున్నా దాన్ని తెరపైకి తీసుకువచ్చే నిర్మాతలు ముందుకు రావాలి. అయితే నేను ఈ కథను నిర్మాతలకు చెప్పిన వెంటనే వారికి ఈ కథ కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి నా ధన్యవాదాలు. డి .ఓ. పి సెల్వ కుమార్ ప్రతి ఫ్రెమ్ ను పెయింటింగ్ లా చాలా చక్కగా తీశారు. డ్యాన్స్ మాస్టర్ చంద్ర కిరణ్ హీరో హీరోయిన్స్ తో చాలా బాగా డ్యాన్స్ చేయించాడు. ఇందులో NIA అధికారి పాత్రలో నటిస్తున్న నివాస్ ఈ చిత్రంలోని రహస్యాన్ని ఎలా చేదించాడు అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 9 న థియేటర్స్ లలో విడుదల అవుతున్న మా సినిమాను చూసి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

*ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ మాట్లాడుతూ..* డిఫరెంట్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుంది. చరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు, నటీ నటులు టెక్నిషియన్స్ అందరూ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. మాకు సినిమా ఫీల్డ్ కొత్త అయినా టీం అంతా మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఈ నెల 9 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరిని సస్పెన్స్ కు గురి చేస్తుంది అన్నారు.

*అతిధిగా వచ్చిన నటుడు సతీష్ మాట్లాడుతూ..* ఈ సినిమాలోని సాంగ్స్, ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. ఎడిటంగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఇందులో నటించిన వారంతా చాలా సెటిల్డ్ గా నటించారు. ప్రేక్షకులను థ్రిల్ కు గురి చేసే మంచి కంటెంట్ తో ఈ నెల 9 న వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.

*డి. ఓ. పి. సెల్వ కుమార్ మాట్లాడుతూ..* మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు

*ఎడిటర్ ఉద్దవ్ మాట్లాడుతూ…* ఈ సినిమాలో ఒక్క షార్ట్ కూడా వేస్ట్ కాకుండా టీం అంతా పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకొని అనుకున్న కథను అనుకున్నట్లే చాలా చక్కగా తీయడం జరిగింది. ఇందులో అంతా కొత్తవారైనా కథా బలం ఉన్న సినిమా కాబట్టి చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్ అవుతుందని అన్నారు.

*కోరియోగ్రాఫర్ చంద్ర కిరణ్ మాట్లాడుతూ..* ట్రైలర్ కు హ్జ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న “రహస్య” సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

*నటుడు వేద భాస్కర్ మాట్లాడుతూ..* ఇందులో నేను డి. జి. పి పాత్రలో నటిస్తున్నాను. ఇలాంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

*లిరిసిస్ట్ సంజయ్ మహేష్ మాట్లాడుతూ..* ఇలాంటి మంచి సినిమాకు లిరిక్స్ ఇచ్చే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

*నటీ నటులు:*
బుగతా సత్యనారాయణ, గెద్ద వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, సూరి బాబు, పాండు రంగారావు, ప్రదీప్, మోడల్ శ్రీను, రాజేశ్వరి, మధు, నల్ల శ్రీను, B.T. రావ్, T.V. రామన్, A.V. ప్రసాద్ తదితరులు

*సాంకేతిక నిపుణులు:*
బ్యానర్ :SSS ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత : గౌతమి.S
దర్శకత్వం ::శివ శ్రీ మీగడ
సంగీతం : :చరణ్ అర్జున్
బ్యాగ్రౌండ్ స్కోర్ : సునీల్ కశ్యప్
కెమెరామెన్‌ : జీ సెల్వ కుమార్
ఎడిటర్‌ : ఎస్ బి ఉద్దవ్
పి.ఆర్.ఓ : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు

Previous Post

చెడ్డి గ్యాంగ్ తమాషా టైటిల్ టిజర్ ను రిలీజ్ చేసిన సునీల్

Next Post

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ‘నిన్నే పెళ్లాడతా’ టీజర్ విడుదల

Next Post
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ‘నిన్నే పెళ్లాడతా’ టీజర్ విడుదల

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ‘నిన్నే పెళ్లాడతా’ టీజర్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్
movies

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

by admin
February 18, 2026
0

...

Read more
ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

February 17, 2026
When Goodbye Becomes the Most Romantic Hello Story

When Goodbye Becomes the Most Romantic Hello Story

February 13, 2026
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In